MLA Roja Resignation: వైసీపీలో ప‌ద‌వుల చిచ్చు.. రాజీమానాకి సిద్దమైన ఎమ్మెల్యే రోజా!

వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీలో అంతర్గతంగా పదవులపై రచ్చ సాగుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో పార్టీలోని కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 07:05 PM IST
  • వైసీపీలో పదవుల కోసం ఆధిపత్య పోరు!
  • అసంతృప్తిలో ఎమ్మెల్యే రోజా
  • ఇటీవలి పరిణామాలే కారణం!
MLA Roja Resignation: వైసీపీలో ప‌ద‌వుల చిచ్చు.. రాజీమానాకి సిద్దమైన ఎమ్మెల్యే రోజా!

MLA Roja Resignation: వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీలో అంతర్గతంగా పదవులపై రచ్చ సాగుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పదవుల విషయంలో పార్టీలోని కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏమైందంటే..

రాజకీయాల్లో ఫైర్​ బ్రాండ్​గా పేరు గడించిన ఎమ్మెల్యే ఆర్​కే రోజా.. ప‌ద‌వుల చిచ్చు కారణంగా రాజీమానాకు కూడా సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో రోజా ప్రస్తుతం అసంతృప్త నేతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ పరిణామంపై అమె సంతృప్తిగా లేరనేది ఆ వార్తల సారాంశం.

అమె అసంతృప్తికి కారణం.. శ్రీశైలం బోర్డు ఛైర్మన్​ ఎంపిక వ్యవహారమని తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీశైలం బోర్డు ఛైర్మన్​గా చెంగారెడ్డి చక్రపాణి రెడ్డిని నియమించింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఆ పదవికి చెంగారెడ్డి చక్రపాణిని ఎంపిక చేయడం రోజాకు నచ్చలేదట. అందుకే రోజా అలకబూనారట.

స్థానిక ఎన్నికల సమయంలోనే వీరి రోజా, చక్రపాణి వర్గాల మధ్య విభేదాలు తలెత్తింది. చక్రపాణి వర్గం నుంచి కాకుండా.. రోజా వర్గం నుంచి ఓ వక్తిని ఎంపిపీగా చేయడం ఇందుకు కారణం.

అందుకే ఈ విషయంపై చర్చించేందుకు ఎమ్మెల్యే రోజా త్వరలో సీఎం జగన్​ను కలవనున్నారని సమాచారం. ముఖ్యమంత్రి నుంచి కూడా తనకు అనుకూల ప్రకటన రాకుంటే.. రోజా తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

మరి ఈ అంశం వైసీపీలో వర్గ పోరుకు దారి తీస్తుందా? లేదా అదిష్ఠానం, సీనియర్ నాయకులు కలుగుజేసుకుని వివాదాన్ని సద్దుమనిగేలా చూస్తారా వేచి చూడాలి.

Also read: AP Covid-19 Update: ఏపీలో 4వేలకుపైగా కొత్త కేసులు, 9వేల రికవరీలు..

Also read: CM YS Jagan: చలో విజయవాడలో ఉద్యోగులకు పోలీసుల సహకారంపై సీఎం జగన్ ఆరా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News