India Vs Australia ODI Series: క్రికెట్లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన
India Vs Australia ODI Series | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కోల్పోయింది. అయితే ఈ సిరీస్‌లో సొంతగడ్డపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లపై చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీకి ఓ విషయాన్ని సూచించాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కోల్పోయింది. అయితే ఈ సిరీస్‌లో సొంతగడ్డపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లపై చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీకి ఓ విషయాన్ని సూచించాడు. ‘స్విచ్ హిట్టింగ్’ షాట్‌ను నిషేధించాలని కోరాడు. అందుకు కారణం సైతం వివరించాడు. స్విచ్ హిట్టింగ్ షాట్ వల్ల బౌలర్, ఫీల్డర్లకు అన్యాయం జరుగుతుందని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.
స్విచ్ షాట్ అంటే..
రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే ఆటగాడు.. ఎడమ వైపునకు తిరిగి బంతిని కొట్టడం స్విచ్ హిట్టింగ్ అంటారు. అయితే ఇలా చేయడం వల్ల బౌలర్‌కు, ఫీల్డింగ్ జట్టుకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ తరచుగా ఈ స్విచ్ హిట్టింగ్ ఆడి పరుగులు సాధిస్తు్ంటారు. ఇదే విషయాన్ని ఇయాన్ చాపెల్ ప్రస్తావించాడు. ఇది నైపుణ్యంతో కూడుకున్న క్రికెట్ షాట్. కానీ న్యాయబద్ధమైనది మాత్రం కాదని చాపెల్ పేర్కొన్నాడు.
IND vs AUS 3rd ODI Live Updates: క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
ఎందుకంటే బౌలర్ సంధించిన బంతిని రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ లెప్ట్ హ్యాండర్‌గా, లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా బంతిని షాట్ ఆడితే ఫీల్డర్లను సెట్ చేయడం ఎలా కుదురుతుందని ఇయాన్ చాపెల్ ప్రశ్నించాడు. ఈ కారణంగా బౌలర్‌కు, ఫీల్డింగ్ జట్టుకు అన్యాయం జరుగుతుందన్నాడు. లేనిపక్షంలో బ్యాట్స్‌మెన్ తాను స్విచ్ షాడ్ ఆడతానని చెప్పి బంతిని ఎదుర్కొంటే ప్రయోజనం ఉంటుందన్నాడు.
India vs Australia: భారత క్రికెటర్లకు జరిమానా విధించిన ఐసీసీ
ఓవర్ ది వికెట్ అని చెప్పి రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేస్తే అంపైర్లు ఫిర్యాదు చేస్తారని, స్విచ్ హిట్టింగ్ విషయంలో నిబందనలు లేకపోవడాన్ని తప్పుపట్టాడు. భారత కామెంటెటర్ హర్షా బోగ్లే సైతం ఇయాన్ చాపెల్ సూచనకు మద్దతు తెలపడం గమనార్హం.