శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్‌సాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిషేధం విధించింది. గతంలో దక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాడు ఫిక్సింగ్‌ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నువాన్ జోయ్‌సా తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతడిపై ఆరోపణలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్‌సాపై విధించిన ఆరేళ్ల నిషేధం 31 అక్టోబర్ 2018 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ ప్రకటన చేసింది. ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం లాంటివి ఐసీసీ(ICC) నిబంధనలు ఉల్లంఘించడం అవుతుంది. ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి.  Also Read: IPL 2021: ఆర్సీబీ ప్లేయర్ AB de Villiers అరుదైన ఘనత, బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో 5000 పరుగులు


ఆర్టికల్ 2.4.4 అవినీతికి పాల్పడలేదని ఆధారాలు చూపించలేకపోవడం, అవినీతికి పాల్పడేందుకు అవకాశాలు, ఆహ్వానాలు పలకడం మరికొన్ని విషయాలు ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకి వస్తాయి. టీ10 లీగ్‌లో చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకుగానూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) తరఫున అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి శ్రీలంక(Sri Lanka) క్రికెటర్ నువాన్ జోయ్‌సాపై నిషేధం విధించింది. 


శ్రీలంక జట్టుకు 125 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి అవినీతికి పాల్పడ్డాడని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయడం అనేది ఏ ఆటకైనా క్షమార్హం కాదని, ఇది ఆటకు కళంకం తీసుకొచ్చే చర్య అని పేర్కొన్నాడు.


Also Read: IPL 2021: విదేశీ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్, కంగారు పడొద్దని ఆటగాళ్లకు భరోసా ఇచ్చిన బోర్డ్


శ్రీలంక తరఫున జాతీయ జట్టుకు 30 టెస్టులు, 95 వన్డేలలో నువాన్ జోయ్‌సా ప్రాతినిథ్యం వహించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అద్భుతమైన రికార్డ్ ఈ క్రికెటర్ సొంతం. టెస్టు క్రికెట్‌లో తొలి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు పడగొట్టి అరుదైన హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook