IPL 2021: ఆర్సీబీ ప్లేయర్ AB de Villiers అరుదైన ఘనత, బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో 5000 పరుగులు

IPL 2021 AB de Villiers | రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను వెనక్కి నెడుతూ అరుదైన ఘనతను 360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 28, 2021, 09:25 AM IST
IPL 2021: ఆర్సీబీ ప్లేయర్ AB de Villiers అరుదైన ఘనత, బెస్ట్ స్ట్రైక్ రేట్‌తో 5000 పరుగులు

IPL 2021 Latest News | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో విదేశీ ఆటగాడు, కాగా, అతి తక్కువ బంతుల్లోనే ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్ అయ్యాడు. 5వేలు పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(150కి పైగా) ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 

రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను వెనక్కి నెడుతూ అరుదైన ఘనతను 360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. సురేశ్ రైనా కేవలం 135 ఇన్నింగ్స్‌లు ఇప్పటివరకూ అత్యంత వేగంగా ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. బంతుల పరంగా చూస్తే డివిలియర్స్ 161 ఇన్నింగ్స్‌లు, 3,288 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్ 2021(IPL 2021)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై 42 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఆర్సీబీ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

Also Read: IPL 2021: విదేశీ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్, కంగారు పడొద్దని ఆటగాళ్లకు భరోసా ఇచ్చిన బోర్డ్

విరాట్ కోహ్లీ 6041 పరుగులతో లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. సురేష్ రైనా 5,472 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లు 5000 ఐపీఎల్ పరుగులు చేసిన క్రికెటర్లు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ ఈ అరుదైన ఫీట్ చేరుకోగానే డేవిడ్ వార్నర్ 360 డిగ్రీస్ ఆటగాడిని అభినందించాడు. లెజెండ్, మై ఐడల్ అని ట్వీట్ చేశాడు.

5000 ఐపీఎల్ పరుగులు చేయడానికి ఎదుర్కొన్న బంతులు

1) ఏబీ డివిలియర్స్ - 161 ఇన్నింగ్స్‌లు, 3288 బంతులు
2) డేవిడ్ వార్నర్ - 135 ఇన్నింగ్స్‌లు, 3554 బంతులు
3) సురేశ్ రైనా - 173 ఇన్నింగ్స్‌లు, 3620 బంతులు
4) రోహిత్ శర్మ - 188 ఇన్నింగ్స్‌లు, 3817 బంతులు
5) విరాట్ కోహ్లీ - 157 ఇన్నింగ్స్‌లు, 3827 బంతులు
6) శిఖర్ ధావన్ - 168 ఇన్నింగ్స్‌లు, 3956 బంతులు

Also Read: T20 World Cup: భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం కాకపోతే మరో వేదిక 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News