ICC Dog Of The Month: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుల జాబితాలో ఒక  శునకం చోటు సంపాదించింది. ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు(ICC Dog Of The Month) గెలుచుకున్న ఆ బుజ్జి కుక్క ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది.  ఈ అవార్డుపై ఐసీసీ(ICC) ట్విటర్‌లో స్పందింస్తూ.. ''ఈసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క అది.. అందుకే దాన్ని అథ్లెట్‌ డాగ్‌ పరిగణిస్తూ.. ''ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌'' అవార్డును బహుకరించాం'' అంటూ పోస్ట్‌ చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Team India Cricketers: కోట్లాది సంపద ఉన్నా..ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ క్రికెటర్స్ వివరాలు


గతవారం ఐర్లాండ్‌ క్లబ్‌ క్రికెట్‌(Ireland Club Cricket)లో భాగంగా మైదానంలో బుజ్జి కుక్క ఫీల్డర్లను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. బ్రీడీ, సీఎస్‌ఎన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్‌ దిశగా షాట్‌ ఆడింది. ఫీల్డర్‌ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరింది. అదే సమయంలో ఒక బుజ్జి కుక్క(Dog) తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్‌ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్‌ అయింది. అలా రనౌట్‌ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్‌లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook