Team India Cricketers: కోట్లాది సంపద ఉన్నా..ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ క్రికెటర్స్ వివరాలు

భారతీయ క్రికెటర్లలో దిగ్గజులుగా ఉన్న కొంతమందికి కోట్లాది రూపాయల సంపద ఉన్నా..ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలు క్రికెట్ పరంగా ఎంతగా ప్రాచుర్యం పొందారో..సంపాదనపరంగా కూడా అంతే ఫ్యామస్ అయ్యారు. రోజూ కోట్లాది రూపాయలు సంపాదించే ఈ క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. ఆ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

Team India Cricketers: భారతీయ క్రికెటర్లలో దిగ్గజులుగా ఉన్న కొంతమందికి కోట్లాది రూపాయల సంపద ఉన్నా..ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలు క్రికెట్ పరంగా ఎంతగా ప్రాచుర్యం పొందారో..సంపాదనపరంగా కూడా అంతే ఫ్యామస్ అయ్యారు. రోజూ కోట్లాది రూపాయలు సంపాదించే ఈ క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. ఆ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

1 /7

టీమ్ ఇండియాలో అత్యంత సక్సెస్‌ఫుల్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. చిన్నతనం నుంచి ఆర్మీలో పనిచేయాలనేది అతని కోరిక. టీమ్ ఇండియాను ఎత్తైన శిఖరానికి చేర్చిన తరువాత అతని కల సాకారమైంది. 2015లో మహేంద్రసింగ్ ధోనీకు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పదవి లభించింది. ఖాళీ సమయంలో ధోనీ..ఇండియన్ ఆర్మీతో గడుపుతుంటారు.

2 /7

ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచే సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. అతని ప్రతిభ ఆధారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సన్మానం చేయడమే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్‌గా చేశారు 2010లో. 

3 /7

టీమ్ ఇండియాలో విజయవంతమైన స్పిన్ బౌలర్‌గా ఎక్కువకాలం సేవలందించిన మేటి క్రికెటర్‌గా ఖ్యాతి పొందింది హర్భజన్ సింగ్. ఈ ఆటగాడు టెస్ట్‌లో 7 వందల కంటే ఎక్కవ వికెట్లు సాధించాడు. ఈ ప్రతిభ ఆధారంగానే అతనికి పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ పదవి లభించింది. 

4 /7

ఇక మరో దిగ్గజ క్రికెటర్ జోగిందర్ శర్మ. 2007 టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాకు కప్ సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్ ఓవర్‌తో విజయం తెచ్చిపెట్టాడు. ఎక్కువకాలం టీమ్ ఇండియాలో కొనసాగలేకపోయాడు. జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ శాఖలో డీఎస్పీగా పని చేస్తున్నారు. 

5 /7

కపిల్ దేవ్. నాటి మేటి క్రికెట్ దిగ్గజం. ఇండియాకు తొలిసారిగా ప్రపంచ కప్ సాధించిపెట్టిన కెప్టెన్. ఎందరో క్రికెటర్లకు ఆదర్శనీయుడు. ఈ ప్రతిభ ఆధారంగానే కపిల్ దేవ్‌కు 2008లో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పదవి లభించింది. ఇది కాకుండా 2019లో కపిల్ దేవ్..హర్యానా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా కూడా నియుక్తులయ్యారు. 

6 /7

టీమ్ ఇండియాకు విజయం సాధించిపెట్టడంలో చాలాసార్లు కీలక భూమిక వహించిన మరో క్రికెటర్ ఉమేష్ యాదవ్. చిన్నతనం నుంచే ఉమేష్‌కు పోలీసు లేదా ఆర్మీలో పనిచేయాలనేది కోరిక. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఇతడు 2017 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 

7 /7

అతి తక్కువ సమయంలోనే క్రికెటర్ యజువేంద్ర చహల్ కీర్తి సంపాదించారు. అద్భుతమైన బౌలింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే క్రికెట్‌తో పాటు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారని చాలామందికి తెలియదు.