ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంటోంది. తాజాగా జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను దక్కించుకుంది. దీంతో టీమిండియా అదనపు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గతంలో 108 పాయింట్లకు మరో మూడు పాయింట్లను పెంచుకుంది. ప్రస్తుతం 111 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈమేరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్థానంలో మార్పులేదు. పాయింట్లు పెరిగినా మూడో స్థానంలోనే నిలిచింది. నెదర్లాండ్‌ను 3-0తో సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ప్రస్తుతం 107 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 124 పాయింట్లతో న్యూజిలాండ్ తొలి స్థానంలో, 119 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.  


మరోవైపు జింబాబ్వే టూర్‌లో వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో 13 పరుగులతో తేడాతో భారత్ విజయం సాధించింది. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా 115 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అతడు ఔట్ కావడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. అంతకుముందు జరిగిన మొదటి, రెండో వన్డేలో జింబాబ్వే జట్టు తేలిపోయింది. ఈమ్యాచ్‌ల్లో భారత్ సులువుగా గెలిచింది. 


[[{"fid":"242629","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:BJP Mla Raja Singh: రాజాసింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్..పార్టీ నుంచి సస్పెన్షన్..!


Also read:Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌పై సర్వత్రా ప్రశంసలు..తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్ధలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి