ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా షెడ్యూల్ ప్రకారమే జరుగనుందని, అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఐసీసీ స్పష్టం చేసింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచకప్ ప్రక్రియను  మారుస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని అంతర్జాతీయ క్రికెట్ పాలకమండలి పునరుద్ఘాటించింది. ప్రపంచకప్ టోర్నీకి ప్రారంభమవ్వడానికి చాలా సమయముందని, ఈ టోర్నీ జరిగే నాటికి కరోనా సంక్రమణ పూర్తి నియంత్రణలోకి వస్తుందని ఐసీసీ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: అలా చేస్తే దేశం నాశనమే.. బిల్ గేట్స్


మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా పొట్టి క్రికెట్ టోర్నీని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై సందేహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా మరి కొన్ని వారాల్లోనే ఈ టోర్నీ నిర్వహణపై స్పష్టమైన ప్రకటను నిర్వహణ కమిటీ చేస్తుందని, షెడ్యూలుపై దుష్ప్రచారం తగదని హితవు పలికింది. 


Read also : లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం సోనియా గాంధీ ఫైర్


ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి 20 ప్రపంచ కప్ ను అత్యధికంగా రికార్డు స్థాయిలో వీక్షించారని ఐసీసీ డిజిటల్ ప్రసార వీక్షణ గణాంకాలను విడుదల చేసింది. డిజిటల్ ఛానెళ్లలో మొత్తం 1.1 బిలియన్ వీడియో వీక్షణలను వచ్చాయని, ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించిన టోర్నమెంట్ గా నమోదయ్యిందని ఐసీసీ పేర్కొంది. ఈ ఫైనల్‌ టోర్నీ ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరగగా సుమారుగా 86,174 మంది అభిమానులు హాజరయ్యారని, భారత్ నుండి సగటున 9.02 మిలియన్ల ప్రేక్షకులు పాల్గొన్నారని ఐసీసీ తెలిపింది. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read also : ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లపై రైల్వే శాఖ క్లారిటీ