ICC Team: ఐసీసీ అత్యుత్తమ టీమ్.. భారత్ నుంచి ఇద్దరి చోటు!
Virat Kohli and Suryakumar Yadav named In Most Valuable Team Of T20 World Cup 2022. అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ కటించింది. ఈ జట్టులో ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది.
ICC Most Valuable Team of T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ఆదివారం (నవంబర్ 13) ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పొట్టి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 137 పరుగులే చేసింది. షాన్ మసూద్ (38) టాప్ స్కోరర్. ఇంగ్లీష్ పేసర్ సామ్ కరన్ 3 వికెట్స్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్ (52 నాటౌట్; 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో రవుఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.
టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది. భారత్ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ జట్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను సారధిగా ఎంపిక చేసింది. అంతేకాదు వికెట్‌కీపర్, ఓపెనర్‌గానూ ఐసీసీ అతన్నే ఎంచుకుంది.
ఓపెనర్లుగా జొస్ బట్లర్, అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)ను ఐసీసీ ఎంపిక చేసింది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లకు అవకాశం ఇచ్చింది. ఆల్‌రౌండర్ కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ ఇచ్చింది. బౌలర్లుగా సామ్ కరన్, అన్రిచ్ నోర్జ్ (దక్షిణాఫ్రికా), మార్క్ వుడ్ (ఇంగ్లండ్), షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు ఐసీసీ అవకాశం కల్పించింది. హార్ధిక్ పాండ్యాను 12వ ఆటగాడిగా ఎంచుకుంది.
టీ20 ప్రపంచకప్ 2022లో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో (82 నాటౌట్) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. బంగ్లాదేశ్‌పై 64, నెదర్లాండ్స్‌పై 62, ఇంగ్లండ్‌పై 50 పరుగులు చేసి మెగా టోర్నీలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచకప్ 2022లో 239 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. నెదర్లాండ్స్‌పై 51, దక్షిణాఫ్రికాపై 68, జింబాబ్వేపై 61 పరుగులు బాదాడు.
Also Read: CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి