ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 త్వరలో జరగనుంది. ఇండియా ఆతిధ్యమిస్తున్న ప్రపంచకప్‌కు 9వ జట్టుగా శ్రీలంక అర్హత సాధించగా ఇక పదవ జట్టు ఏదనేది ఇంకా నిర్ధారణ కావల్సి ఉంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ ఇలా ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా ఆతిద్యమిస్తున్న వన్డే ప్రపంచకప 2023కు ఇప్పటికే 8 జట్లు అర్హత పొందాయి. ఇక మిగిలిన 9, 10 జట్ల కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రపంచకప్ 9వ జట్టు స్థానం కోసం ఇవాళ శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్ స్టేజ్‌లో జింబాబ్వేపై 9 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక 8 పాయింట్లతో నేరుగా 9వ జట్టుగా ఎంపికైంది. ఇక జింబాబ్వే జట్టు వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించింది. 


ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలవుట్ అయింది. జింబాబ్వే తరపున సీన్ విలియమ్స్ ఒక్కడే 56 పరుగులతో విజృంభించాడు. శ్రీలంక బౌలర్లలో మహేశ్ తీక్షణ 4 వికెట్లతో రాణిస్తే మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు పడగొట్టారు. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 33.1 ఓవర్లలో వికెట్ నష్టానికి స్కోర్ ఛేధించింది. అంతే నేరుగా ప్రపంచకప్‌లో 9వ జట్టుగా అర్హత సాధించగా జింబాబ్వే వైదొలగింది.


ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 19 వరకూ జరుగుతుంది. దేశంలోని 10 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 10 జట్లు ఉంటాయి. ఇప్పటికే 8 జట్లు నేరుగా అర్హత సాధించిన శ్రీలంక ఇవాళ్టి మ్యాచ్‌లో ఘన విజయంతో 9వ జట్టుగా అర్హత పొందింది. ఇక పదవ జట్టు ఏదనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. నవంబర్ 15, 16 తేదీల్లో ముంబై, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్స్ జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ పోరు జరగనుంది. హైదరాబాద్‌లో 3 మ్యాచ్‌లు జరనున్నాయి.


Also read: World Cup 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. వరల్డ్ కప్‌ కోసం పాక్ బోర్డు కీలక నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook