Ravichandran Ashwin Takes No 1 Spot In ICC Test Rankings 2023: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్ సత్తాచాటారు. వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి బౌలింగ్ విభాగంలో నంబర్‌ 1గా నిలిచాడు. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ పైకి దూసుకొచ్చాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకు చేరుకున్నాడు. ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంతో నిలిచాడు. ఇక రోడ్డు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ 9వ స్థానంలో నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ విజృంభించాడు. మొత్తంగా 25 వికెట్లు పడగొట్టి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.  25 వికెట్లతో పాటు 86 పరుగులు చేయడంతో అశ్విన్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు' కూడా దక్కింది. ప్రస్తుతం యాష్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్స్ (ICC Test Rankings) ఉన్నాయి. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను (859) వెనక్కి నెట్టి నంబర్‌ 1గా అవతరించిన విషయం తెలిసిందే. సీనియర్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (780) 7వ స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా (753) 9వ స్థానంలో ఉన్నాడు.


ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) అగ్రస్థానంలో ఉన్నాడు. లబుషేన్‌ ఖాతాలో 915 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టెస్టుల్లో సెంచరీ బాదాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారీ సెంచరీ (186) చేసి అంతర్జాతీయ కెరీర్‌లో 75వ శతకం నమోదు చేశాడు. దీంతో విరాట్ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్‌ (766) 9వ స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (739) 10వ ర్యాంకులో ఉన్నాడు. 


ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో రవీంద్ర జడేజా (431), ఆర్ అశ్విన్ (359)లు ఉన్నారు. అక్షర్ పటేల్ (316) రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్‌ చేరాడు. ఇక ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (122)‌ అగ్రస్థానంలో ఉంది.  భారత్ (119), ఇంగ్లండ్ (106), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100) టాప్ 5లో ఉన్నాయి. 


Also Read: Honda Shine 100 CC: హోండా సరికొత్త బైక్.. ధర 65 వేలు మాత్రమే! సూపర్ లుకింగ్, బెస్ట్ మైలేజ్


Also Read: Mrunal Thakur Hot Pics: మృణాల్ ఠాకూర్ బ్లాస్టింగ్ అందాలు.. పొట్టి డ్రెస్‌లో మైమరపిస్తోన్న సీత సోయగాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి