ICC Rankings 2024 updates: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను 4-1తో కైవసం చేసుకోవడం ద్వారా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి పరిమితమైంది. టీమిండియా చేతిలో చావు దెబ్బతిన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి పడిపోయింది. 122 రేటింగ్ పాయింట్లతో భారత్ జట్టు తొలి స్థానంలోనూ, 117 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలోనూ, 111 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీలో కూడా మనదే హవా..
వరల్డ్  టెస్టు ఛాంపియన్ షిప్ లోనూ భారత్ హవా కొనసాగుతోంది. ఇంగ్లండ్ పై విజయంతో న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి దూసుకొచ్చింది. . 68.51 గెలుపు శాతంతో 74 పాయింట్లు సాధించి రోహిత్ స్థానంలో టాప్ లో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరింట్లో గెలిచి, రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న కివీస్ 60 విజయ శాతంతో 36 పాయింట్లు సాధించింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ మూడు విజయాలతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. 


Also Read: Shami Political Entry: క్రికెటర్‌ షమీని అస్త్రంగా బీజేపీ బెంగాల్‌ రాజకీయం


వన్డే, టీ20ల్లో కూడా మనమే నంబర్ వన్..
వన్డే ర్యాంకింగ్స్ లోనూ రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతోంది. 121 రేటింగ్ పాయింట్లతో  టీమిండియా అగ్రస్థానంలోనూ, 118 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఇక టీ20 ర్యాంకుల్లోనూ భారత్ సత్తా చాటింది. 266 రేటింగ్‌ పాయింట్లతో భారత్ ఫస్ట్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో 256 పాయింట్లతో ఇంగ్లండ్ ఉంది.


Also Read: IND vs ENG 5th Test: అశ్విన్ మ్యాజిక్.. ధర్మశాలలో చిత్తు చిత్తుగా ఓడిన ఇంగ్లండ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook