ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా.. నంబర్ టు ప్లేస్‌కు హార్ధిక్ పాండ్యా
Hardik Pandya Reached Second Spot in All Rounder T20 Rankings: న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు.. టీ20 ర్యాంక్సింగ్స్‌లో మెరుగైన స్థానాల్లో నిలిచారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్ టు స్థానానికి ఎగబాకాడు. శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్ కూడా కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ సాధించారు.
Hardik Pandya Reached Second Spot in All Rounder T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుపై అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ర్యాంకులు మెరుగయ్యాయి. టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో కూడా లేని గిల్ దెబ్బకు 30వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 8 స్థానాలు ఎగబాకి.. 13వ స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 4/16తో చెలరేగాడు. బ్యాటింగ్‌లోనూ 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మహ్మద్ నబీని అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. పాండ్యా ఖాతాలో ప్రస్తుతం 250 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. షకీబ్‌కు పాండ్యాకు కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
న్యూజిలాండ్‌పై 63 బంతుల్లో 126 పరుగుల మెరుపు సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఉనికి చాటుకున్నాడు. ఈ సెంచరీతో ఏకంగా 168 స్థానాలు ఎగబాకి.. 30వ స్థానానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు టీ20 క్రికెట్‌లో గిల్‌కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. తొలి హాఫ్ సెంచరీనే శతకంగా మలిచి.. టీ20 క్రికెట్‌లో ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ర్యాంక్ కూడా మెరుగైంది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు 21వ ర్యాంక్‌లో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు 635 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కివీస్‌పై సిరీస్‌లో విఫలమవ్వడంతో రెండు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. 908 నుంచి 906 పాయింట్లకు పడిపోయింది. అయినా నంబర్ టు బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ కంటే చాలా ముందున్నాడు. మహ్మద్ రిజ్వాన్ ఖాతాలో 836 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో బాబర్ ఆజామ్, డ్వేన్ కాన్‌వే, ఐడెన్ మార్క్రామ్ ఐదో స్థానంలో ఉన్నారు. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మినహా మరే భారత ఆటగాడు టాప్ టెన్‌లో లేడు. టీ20 బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read: UP Murder Case: పెళ్లికి నిరాకరించడంతో యువకుడిని చంపేసిన ప్రియురాలు.. ఎలా దొరికిపోయారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
లక్ష్మీ