టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తుంటే ఎవరైనా మైమర్చిపోవల్సిందే. అద్భుతమైన హిట్టర్ టీమ్ ఇండియాకు లభించాడని చెప్పొచ్చు. సూర్య కుమార్ ప్రతిభకు ఇప్పుడు మరో అద్భుత గుర్తింపు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్. ఇండియన్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీ20లో నెంబర్ 1 స్థానం దక్కింది. సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత బ్యాటింగ్‌తో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అదే సమయంలో టీ20 బ్యాటర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 50వ స్థానంలో నిలిచాడు.


నెంబర్ 1 సూర్యకుమార్ యాదవ్


సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 111 పరుగులు సాధించి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడు మ్యాచ్‌లలో 31 రేటింగ్ గణాంకాన్ని సాధించాడు. రెండవస్థానంలో పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ నిలిచాడు.


50వ స్థానంలో హార్దిక్ పాండ్యా


న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమ్ ఇండియాకు నేతృత్వం వహించిన హార్దిక్ పాండ్యా చివరి మ్యాచ్‌లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ..ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో 50వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో ఇండియన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో నిలిచాడు. గతంలో 13వ స్థానంలో ఉన్నాడు భువనేశ్వర్. ఇక అర్షదీప్ సింహ్ 21వ స్థానంలో ఉన్నాడు.


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 6వ స్థానంలో


స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఏకంగా 40వ స్థానంలో నిలిచాడు. టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి వన్డే ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్లలో బూమ్రా 11వ స్థానంలో ఉన్నాడు.


ఆస్ట్రేలియాకు చెందిన గ్రేట్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ట్రేవిస్ హెడ్‌లు మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంపై 269 పరుగుల భాగస్వామ్యంతో ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చూపించిన స్టీవ్ స్మిత్ కూడా కెరీర్‌లో అద్భుతంగా 7వ స్థానంలో నిలిచాడు.


ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ వన్డేలో 106 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ స్థానంలో నిలిచాడు. అటు 152 పరుగులు సాధించిన హెడ్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని..30వ స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల జాబితాలో స్టార్క్ 4వ స్థానంలో ఆడమ్ జంపా 7వ స్థానంలో ఉన్నారు.


Also read: Ravi Shastri: రోహిత్ శర్మ కంటే హార్థిక్ పాండ్యా టీమ్ బెటర్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook