ICC T20 WC 2022: ఈనెల 16 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లోనే దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈనెల 23న మెల్‌బోర్న్ వేదికగా ఈమ్యాచ్‌ జరగనుంది. ప్రపంచ దేశాలన్నీ వరల్డ్ కప్‌నకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమ జట్లను ఆయా దేశాలు ప్రకటించాయి. ఈనేపథ్యంలో ప్రపంచంలోనే టాప్-5 టీ20 ఆటగాళ్లను ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈజాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు దక్కలేదు. భారత్‌ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించాడు గిల్ క్రిస్ట్. టాప్-5 జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు తొలి స్థానం ఇచ్చాడు. రెండో స్థానంలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజామ్ ఉన్నాడు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో హార్ధిక్ పాండ్యా, అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు చోటు కల్పించాడు.


ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్‌కు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. త్వరలో వరల్డ్ కప్ జరగనుండటంతో టాప్‌ ఆటగాళ్లను మాజీ క్రికెటర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీలు తమ టీమ్‌లను వెల్లడించారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతుందన్న వాదన ఉంది. ప్రతి మెగా టోర్నీ ముందు సీనియర్ ప్లేయర్..తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈసారి కూడా టీమిండియా బెస్ట్‌ టీమ్‌గా రంగంలోకి దిగుతోంది.


ఈనెల 23 నుంచి వరల్డ్ కప్‌లో టీమిండియా వేట కొనసాగనుంది. భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ జట్లు ఒకే టీమ్‌లో ఉన్నాయి. ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. వరల్డ్ కప్ సన్నాహాకల్లో భాగంగా ఆయా దేశాల్లో టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇటు పాకిస్థాన్‌, ఇంగ్లండ్ మధ్య 7 టీ20 సిరీస్ ముగిసింది. ఇటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు టీ20లు ఆడుతున్నాయి. మొత్తంగా వరల్డ్ కపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.


Also read:5G Services: భారతదేశంలో 5జీ యుగం..గుడ్‌న్యూస్ చెప్పిన జియో సంస్థ..!


Also read:Afghanistan: అఫ్ఘనిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి..53 మంది మృతి..పలువురికి గాయాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook