Rohit Sharma Retirment: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ మార్గంలోనే పయనిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై విజయంతో విశ్వ విజేతగా నిలిచిన తరువాత టీ20 ఫార్మట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టుగా సంచలన ప్రకటన చేశాడు. అంతకు కాస్సేపు ముందు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు. టీ 20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ ఇండియా నిలవడంతో అభిమానులంతా సంబరాలు జరుపుకుంటుంటే ఆ ఇద్దరు మాత్రం షాక్ ఇచ్చారు. పొట్టి ఫార్మట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ముందుగా విరాట్ కోహ్లి ప్రకటించగా, ఆ వెంటనే రోహిత్ శర్మ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. జట్టును విశ్వ విజేతగా నిలిపి గ్రాండ్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ప్రపంచకప్ టైటిల్ అందుకున్న తరువాత టీ20 ఫార్మట్ నుంచి వీడ్కోలు చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని వ్యాఖ్యానించాడు.


17 ఏళ్ల క్రికెట్ జర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు సాధించాడు. 159 మ్యాచ్‌లు ఆడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఈ ఫార్మట్‌లో 5 సెంచరీలున్నాయి. ఇది నా చివరి ఆట..ఈ ఫార్మట్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పట్నించి ఆస్వాదించాను.. ప్రతి క్షణం ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నాను..ఎప్పటికీ ఇదే కోరుకుంటాను, కప్ గెలవాలని బలంగా కోరుకున్నానంటూ వ్యాఖ్యానించాడు. విజయం తరువాత ఓ వ్యక్తి చేతిలో జాతీయ జెండా తీసుకుని గ్రౌండ్‌లో పాతిపెట్టి సెల్యూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 


విజేతగా నిలిచిన తరువాత గ్రౌండ్‌పై పడుకుని గట్టిగా నేలపై కొట్టడం, కంట నీరు పెట్టుకోవడం వంటి దృశ్యాలు రోహిత్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. చివరి ఓవర్‌లో చేసిన అద్భుత బౌలింగ్‌కు హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా మీడియా ఇంటర్వ్యూ ఇస్తుండగానే హత్తుకుని ముద్దాడిన వీడియా వైరల్ అవుతోంది. 


టీ20 ఫార్మట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శ్రమ టెస్ట్, వన్డే ఫార్మట్‌లో కొనసాగుతానని చెప్పాడు. దేశం కోసం ఆడే కొత్త తరానికి అవకాశాలిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. 


Also read: AP EAPCET Counselling: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన తేదీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook