6 India U 19 players test positive for Covid 19: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ 2022 (U 19 World Cup 2022)లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం రేగింది. బుధవారం ఐర్లాండ్‌తో మ్యాచుకు ముందు భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది. కెప్టెన్ యశ్ ధుల్ (Yash Dhull), వైస్ కెప్టెన్ ఎస్‌కే రషీద్‌ (SK Rasheed)తో సహా మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు పాజిటివ్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ కూడా కరోనా బారిన పడ్డారు. అందరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా కారణంగా భారత యువ జట్టు (India U 19 Team) కష్టాల్లో కూరుకుపోయింది. ఐర్లాండ్‌పై ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడంలో కాస్త ఇబ్బంది పడింది. నిజానికి గత మ్యాచ్‌లో ఆడిన ఇద్దరు కీలక ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ స్థానంలో నిశాంత్ సింధు (Nishant Sindhu)ను కెప్టెన్‌గా నియమించింది. అదృష్టవశాత్తూ 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ (ICC) అనుమతించడంతో టీమిండియాకు కలిసొచ్చింది. కరోనా సోకినా ఆరుగురు తప్ప మిగిలిన 11 మంది ఆటగాళ్లు ఐర్లాండ్‌పై ఆడారు. ఇక ఫీల్డ్‌లో ఆడుతున్న ఆటగాళ్ల కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కోచ్‌ని డ్రింక్స్‌తో పంపాల్సి వచ్చింది. 


Also Read: IND vs SA 1st ODI: శార్దుల్‌ ఠాకూర్‌ పోరాడినా.. తొలి వన్డేలో టీమిండియాకు తప్పని ఓటమి!!



కరోనా పెద్ద దెబ్బ కొట్టినా భారత యువ జట్టు ఐర్లాండ్‌పై (India vs Ireland) సత్తా చాటింది. మొదట భారత్‌ 5 వికెట్లకు 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌ (88; 101 బంతుల్లో 12×4), రఘువంశీ (79; 79 బంతుల్లో 10×4, 2×6) తొలి వికెట్‌కు 164 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. రాజ్‌ బవా (42), నిశాంత్‌ (36), హంగారేర్కర్‌ (39 నాటౌట్‌) సత్తా చాటడంతో భారత్‌ స్కోరు 300 దాటింది. ముజామిల్ షెర్జాద్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌ 39 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జాషువా కాక్స్ 28 పరుగులు చేయగా.. స్కాట్ మక్‌బెత్ 32 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో గర్వ్ సాంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌశల్ తాంబే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ B నుంచి భారత్ సూపర్ లీగ్ దశకు అర్హత సాధించింది.


Also Read: Gold Price Today: బ్యాడ్ ‏న్యూస్: దేశంలో ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook