South Africa beat India by 31 runs: బొలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే (IND vs SA 1st ODI)లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. 297 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగరేసింది. శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur - 50 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 1×6) పోరాడినా.. అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ప్రొటీస్ బౌలర్లు ఎంగిడి (2/64), షంసి (2/52), ఫెలుక్వాయో (2/26) తలో రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీ చేసిన రాస్సి వాండర్ డసెన్ (Rassie van der Dussen -129 నాటౌట్; 96 బంతుల్లో 9×4, 4×6)కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. రెండో వన్డే శుక్రవారం జరుగనుంది.
297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (KL Rahul), శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ (12) తక్కువ స్కోరుకే ఔటైనా.. విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి గబ్బర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ దూకుడుగా ఆడగా.. కోహ్లీ నెమ్మదిగా ఆడాడు. కోహ్లీ ఎక్కువగా సింగిల్స్ తీసినా.. ధావన్ మాత్రం వీలైనప్పుడల్లా ఫోర్లు కొట్టాడు. దాంతో భారత్ 25 ఓవర్లలో 138/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ కొద్దీ వ్యవధిలో ఈ జోడి ఔట్ కావడంతో మ్యాచ్ గమనమే మారిపోయింది. మిడిల్ ఆర్డర్ కారణంగా భారత్ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.
Also Read: Horoscope Today: 20-01-2022 గురువారం.. మీ రాశి ఫలాలు! ఆ రాశి వారికి అన్ని మిశ్రమ ఫలితాలే!!
రిషబ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17) పరుగులు చేయడంతో భారత్ (India) 181/3తో కుదురుకుంటున్నట్లు కనిపించింది. కానీ 7 పరుగుల వ్యవధిలో శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్ (2), పంత్ ఔట్ అవ్వడంతో భారత్ ఓటమి బాటలో పయనించింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (50 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 1×6) బ్యాట్ ఝుళిపించినా.. అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది బుమ్రా (14 నాటౌట్)తో కలిసి ఠాకూర్ 9వ వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.
That's that from the 1st ODI.
South Africa win by 31 runs.
Scorecard - https://t.co/PJ4gV8SFQb #SAvIND pic.twitter.com/NrRNxZgMNK
— BCCI (@BCCI) January 19, 2022
అంతకుముందు టాస్ మొదటగా బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా (South Africa) నిర్ణీత 50 ఓవరల్లో 296 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్ (27), జానెమన్ మలన్ (6)లు నిరాశపరిచారు. తర్వాత క్రీజులోకి కెప్టెన్ తెంబా బావుమా (110; 143 బంతుల్లో 8×4), రాస్సి వాండర్ డసెన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ భారీ స్కోరు చేశారు. హాఫ్ సెంటరీలను ఇద్దరు సెంచరీలుగా మలిచారు. దాంతో నాలుగో వికెట్‌కి 204 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో ప్రొటీస్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ లక్ష్యాన్ని విధించింది.
Also Raed: 5G Services In US: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook