Pooja Vastrakar four fer restricts New Zealand to 260/9: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా సెడ్డెన్‌ పార్కు స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న వన్డేలో న్యూజిలాండ్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసిన న్యూజిలాండ్.. భారత్ ముందు 2621 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లు అమీ సత్తర్​వైట్ ​(75), అమెలియా కెర్ ​(50) హాఫ్ సెంచరీలు చేయగా.. కెటీ మార్టిన్​(41), సోఫీ డివైన్​(35) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్​ 4 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్​ 2, ఝులన్​ గోస్వామి ఓ వికెట్​ తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకువడటంతో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కివీస్ జట్టుకు టీమిండియా పేసర్ పూజా వస్త్రాకర్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ సుజీ బేట్స్‌ (5)ను రనౌట్ చేసింది. ఈ సమయంలో కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (35), అమెలియా కెర్ జట్టును ఆదుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేశారు. దాంతో కివీస్ స్కోర్ 50 పరుగులు దాటింది. అనంతరం  పూజా బౌలింగ్‌లో డివైన్‌ క్యాచ్ ఔట్ అయింది.


అమీ సత్తర్​వైట్, అమెలియా కెర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ స్కోర్ 120 చేరుకుంది. హాఫ్ సెంచరీ చేసిన అమెలియా పెవిలియన్ చేరినా.. మ్యాడీ గ్రీన్‌ అండతో సత్తర్​వైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే సత్తర్​వైట్ అర్ధ శతకం చేసింది.  ఈ జోడి నిష్క్రమణ అనంతరం కెటీ మార్టిన్ 41 పరుగులు చేయడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది. 



భారత పేసర్ పూజా వస్త్రాకర్‌ తన కోటా పది ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్‌ 2, దీప్తి శర్మ ‌, గోస్వామి చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం చేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన 6 పరుగులకే ఔట్ అయింది. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 26 రన్స్ చేసింది. 


Also Read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత


Also Read: Ukraine Maternity Hospital: మెటర్నిటీ హాస్పిటల్‌పై రష్యా బాంబుల వర్షం.. శిథిలాల కింద నవజాత శిశువులు, గర్భిణులు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook