Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత

Magic Figure: దేశంలో మరి కాస్సేపట్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో ఏ రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ ఎంతనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2022, 07:54 AM IST
Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత

Magic Figure: దేశంలో మరి కాస్సేపట్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో ఏ రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ ఎంతనేది తెలుసుకుందాం.

2024లో జరిగే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మరి కాస్సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి బీజేపీ, ఆప్‌లు సంబరాల దిశగా ఉంటే..మిగిలిన పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. ముఖంగా హంగ్ ఏర్పడుతుందని భావిస్తున్న గోవాలో అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులందరినీ శిబిరాలకు తరలించేసింది. గత ఎన్నికల అనుభవం ఆ పార్టీని వెంటాడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ 13 మంది ఎమ్మెల్యేలనే గెల్చుకున్నా..ఇతరుల సహకారంతో అధికారం చేజిక్కించుకుంది. అటు కాంగ్రెస్ పార్టీపై గెల్చిన ఎమ్మెల్యేలు బీజేపీలో జంప్ చేసిన పరిస్థితి. 

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారం సాధించాలంటే మేజిక్ ఫిగర్ తప్పనిసరి. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ..ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా మేజిక్ ఫిగర్ అనే పదం వింటుంటాం. మేజిక్ ఫిగర్‌ను బట్టి ఏ పార్టీకి పగ్గాలు వస్తున్నాయో చెప్పవచ్చు. మేజిక్ ఫిగర్ దాటితేనే ఆ పార్టీకు అధికారం లభిస్తుంది. మేజిక్ ఫిగర్ అనేది ఆ రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో సగానికి కనీసం ఒకటి ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు ఓ రాష్ట్రంలో 50 స్థానాలుంటే అందులో సగం 25. అంటే మేజిక్ ఫిగర్ ఈ రాష్ట్రానికి 25 కంటే ఒకటి అదనం అంటే..26 . ఇలా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మెజిక్ ఫిగర్ ఎంతనేది తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుంటే..కావల్సిన మేజిక్ ఫిగర్ యూపీలో 202గా ఉంది. యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ప్రదానంగా బరిలో ఉన్నాయి. ఇక పంజాబ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 117 కాగా, మేజిక్ ఫిగర్ 59గా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆప్, శిరోమణి అకాళీదళ్, బీజేపీలు రంగంలో ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 కాగా, మేజిక్ ఫిగర్ 36గా ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్సీలు బరిలో ఉన్నాయి. ఇక మణిపూర్ లో మొత్తం 60 స్థానాలుంటే..కావల్సిన మేజిక్ ఫిగర్ 31. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలు బరిలో ఉన్నాయి. ఇక గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్తానాలుండగా..కావల్సిన మేజిక్ ఫిగర్ 21గా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ టీఎంసీ, ఆప్ పార్టీలు బరిలో నిలిచాయి.

Also read; UP Election Result 2022 Live: యూపీ ఎన్నికల దశలు, ఈసారి అవకాశం అఖిలేష్‌కా లేదా యోగీకేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News