Glenn Maxwell: వన్డే క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఇది. ఓడిపోయిందనుకున్న మ్యాచ్. ఒంటి చేత్తోనే మొత్తం స్కోరు సాధించేశాడు. ఆఫ్ఘన్‌‌పై విజయం అందించి జట్టును సెమీస్‌కు చేర్చాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్...రియల్లీ యూ ఆర్ వెల్. ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించడమంటే మాటలు కాదు కదా మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఇది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు అయితే కెరీర్ బెస్ట్. ఆస్ట్రేలియన్లు పాఠాలుగా చెప్పుకోవల్సిన మ్యాచ్. విపత్కర పరిస్థితుల్లో వరుసగా వికెట్లు పడిపోతున్న తరుణంలో ఒక్కడిగా నిలిచి మొత్తం ఇన్నింగ్స్ తానే ఆడి గెలిచాడు. గెలిపించాడు. ఆఫ్ఘన్లు విధించిన 292 పరుగుల భారీ లక్ష్యం ఛాదించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియా 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయిందనుకున్నారు. అవతల క్రీజ్‌పై కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఇవతల గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నాడు. అంతే మ్యాక్స్‌వెల్‌పై ఏం పూనిందో గానీ వికెట్ పడిన పాపాన పోలేదు. అంతవరకూ కొనసాగిన వికెట్ల పతనం ఆగిపోయింది. మ్యాక్స్‌వెల్ తాను ఆడటమే కాకుండా కమిన్స్ అవుట్ కాకుండా నియంత్రించుకుంటూ వచ్చాడు. 


జట్టు కోసం ఓ ఆటగాడు ఎలా కష్టపడాలి అనేది కూడా మ్యాక్స్‌వెల్‌ను చూసి నేర్చుకోవల్సిందే. కండరాలు పట్టేసి, కాలు నొప్పితో బాధపడుతూ అతి కష్టంగా ఒంటరి పోరు చేస్తూ మొత్తం స్ట్రైకింగ్ భారాన్ని తనపై వేసుకుని ఆడాడు. ఓ దశలో మ్యాక్స్‌వెల్‌ను రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కి పిలవాలనుకుంది. అప్పటికి ఇంకా 50 పరుగుల అవసరం ఉండటంతో వెనక్కి రాలేదు. పట్టుదలగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు. జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేర్చాడు. 


ప్రపంచకప్‌లో ఛేజింగ్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. గతంలో ఇంగ్లండ్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ 158 పరుగుల వ్యక్తిగత ఛేజింగ్ స్కోరు ఉండేది. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ 208 పరుగులు చేసి దరిదాపుల్లో ఎవరూ రాకుండా చేసుకున్నాడు. ప్రపంచకప్ ఛేజింగ్‌లో తొలి డబుల్ సెంచరీ ఇదే. 


Also read: Glenn Maxwell: చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. అఫ్గాన్‌పై ఆసీస్ విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook