World Cup 2023 Final: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా ఆరవసారి కప్ చేజిక్కించుకుంది. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన ఇండియా అసలు సిసలైన పదకొండవ మ్యాచ్ ఓడింది. ఓడిన తరువాత పోస్ట్ మార్టమ్ అవసరం ఉందా లేదా అనేది పక్కనబెడితే రోహిత్ ఎక్కడ తప్పు చేశాడనేది చర్చరేగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఓటమి అనంతరం పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. ఫైనల్ వరకూ అన్ని దశల్లో అద్భుతంగా రాణిస్తూ విజయం సాధించిన టీమ్ ఇండియా చివరి మ్యాచ్‌లో ఎందుకు బోర్లా పడిందనే కోణంలో రకరకాల వాదనలు, అంశాలు తెరపైకి వస్తున్నాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో మోత మోగించిన టీమ్ ఇండియా చివర్లో బోర్లా పడిపోయింది. శుభమన్ గిల్ అత్యంత చెత్త షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయినప్పుడు ఆగ్రహంగా చూసిన రోహిత్..ఆ తరువాత అదే చెత్త షాట్ ఆడి తన వికెట్ కోల్పోయాడు. ఇది కచ్చితంగా రోహిత్ తప్పుడు నిర్ణయమే.


ఆస్ట్రేలియా మొదటి మూడు వికెట్లు 45 పరుగుల్లోపే పడిపోయాయి. మొదటి మూడు వికెట్లు పేసర్లకే లభించాయి. బూమ్రా 2 వికెట్లు, షమీ ఒక వికెట్ తీశారు. అయితే సిరాజ్ బౌలింగ్‌కు దిగలేదు. 16-17 ఓవర్ల వరకూ సిరాజ్‌కు స్పెల్ ఇవ్వకపోవడం రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయమంటున్నారు. ప్రారంభంలో పేసర్లకు వికెట్ లభిస్తున్నప్పుడు సిరాజ్‌తో కూడా 3-4 ఓవర్లు చేయించి ఉంటే మరో వికెట్ లభించి ఉండేదని..అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు. 


ఫైనల్ అని తెలిసినప్పుడు రోహిత్ శర్మ దూకుడుగా కాకుండా ఓపిగ్గాఆడి ఉండాల్సిందంటున్నారు. వికెట్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంయమనంతో ఆడాల్సి ఉండింది. ఆస్ట్రేలియా అదే చేసింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినా ఆ తరువాత చాలా ఓపిగ్గా ఆడింది. 


Also read: Ind vs Aus Final: కర్ణుడి చావుకు కారణాలనేకం, టీమ్ ఇండియా ఓటమికి కూడా ఇదే కారణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook