World Cup 2023: విన్నింగ్ కెప్టెన్లకు ఐసీసీ ఆహ్వానం, ప్రత్యేక బ్లేజర్ రెడీ
World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి ఒక్కరోజే మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా టోర్నీ ముగింపు వేడుకల్ని అట్టహాసంంగా జరపనున్నారు. ఇప్పటికే బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
World Cup 2023: ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపు నవంబర్ 19 అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. రెండు దేశాల ప్రధానులకు మ్యాచ్‌కు ఆహ్వానం పంపించారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ నేపధ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ, విదేశాల్లోని ప్రముఖుల్ని ఆహ్వానించడమే కాకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు ఇప్పటి వరకూ జరిగిన వివిధ ప్రపంచకప్‌ల విన్నింగ్ కెప్టెన్లను ఐసీసీ ఆహ్వానించింది. అంతేకాకుండా ఆ కెప్టెన్లు అందరికీ ప్రత్యేక బ్లేజర్ ఇవ్వాలని నిర్ణయించింది.
మ్యాచ్ చూసే సమయంలో లెజెండరీ కెప్టెన్లు అందరూ ఈ బ్లేజర్ ధరించాలని సూచించారు. ఇందులో వెస్డిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఎంఎస్ ధోని, మైఖేల్ క్లార్క్, ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రపంచకప్ నెగ్గినప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలోని పరిణామాల నేపధ్యంలో జైలులో ఉండటంతో ఆయనొక్కడే మ్యాచ్ వీక్షించేందుకు రావడం లేదు. మిగిలినవాళ్లంతా మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నట్టు నిర్ధారణ అయింది.
ఈ అందరికి ప్రత్యేక గ్యాలరీ సిట్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ ముగిసిన తరువాత విన్నింగ్ కెప్టెన్లందరితో ఫోటో సెషన్ కూడా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్స్ టీమ్‌తో ప్రత్యేక ఎయిర్ షో ఉంటుంది.
Also read: Ahmedabad Pitch: ప్రపంచకప్ ఫైనల్‌కు ఎలాంటి పిచ్ సిద్దమౌతోంది, అహ్మదాబాద్ పిచ్ ఎవరికి అనుకూలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook