Ind vs Pak Dream11 Prediction: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డ్రీమ్ 11 అంచనా జట్లు ఇవే, శుభమన్ గిల్ ఆడేనా
Ind vs Pak Dream11 Prediction: దాయాది దేశం పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మరి కాస్సేపట్లో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో 12 వ మ్యాచ్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అదొక హై వోల్టేజ్ మ్యాచ్.
Ind vs Pak Dream11 Prediction: వన్డే ప్రపంచకప్ 2023లో రెండేసి విజయాలు సాధించి మూడో విజయం కోసం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 7 విజయాలతో పైచేయిగా ఉన్న టీమ్ ఇండియా రికార్డు బద్దలు గొడతామంటోంది బాబర్ సేన. మరి రోహిత్ సేన ఏం సమాధానం చెబుతుందో..
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు శుభమన్ గిల్ అందుబాటులో రావచ్చని తెలుస్తోంది. అటు రోహిత్ శర్మ అంచనాలు కూడా గిల్‌పైనే ఉన్నాయి. డెంగ్యూ కారణంగా శుభమన్ గిల్ మొదటి రెండు ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇషాన్ కిషన్ స్థానాన్ని శుభమన్ గిల్‌తో భర్తీ చేయనుంది టీమ్ ఇండియా. అదే సమయంలో శార్ధూల్ ఠాకూర్‌ను కొనసాగించవచ్చు. ఇక పాకిస్తాన్ తరపున నుంచి శ్రీలంకతో ఆడిన జట్టునే బరిలో దించే అవకాశాలున్నాయి. హసన్ అలీ స్థానంలో మొహమ్మద్ వాసిమ్ జూనియర్‌ను రప్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 51 మ్యాచ్‌లు ఉన్నా సరే అత్యధిక ఆసక్తి కల్గించే మ్యాచ్ ఇదే. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
టీమ్ ఇండియా డ్రీమ్ 11 ప్లేయింగ్ 11 అంచనా జట్టు
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లేదా శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్
పాకిస్తాన్ డ్రీమ్ 11 ప్లేయింగ్ 11 అంచనా జట్టు
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ లేదా మొహమ్మద్ వాసిమ్ జూనియర్, హారిస్ రవూఫ్
Also read: Ind vs Pak 2023: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మెగా సమరం నేడే, ఇరు జట్ల బలాబలాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook