Mohammad Shami: ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు చేరింది. ఇండియా. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ బ్యాటింగ్ విభాగంలో రాణిస్తే..మొహమ్మద్ షమీ బౌలింగ్ అంతా తానై నడిపించాడు. టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని సాధించిపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై వాంఖడే స్డేడియంలో జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీపైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఎవరూ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. టీమ్ ఇండియా విజయం సాధించి పైనల్‌కు చేరడం ఒక్కటే కాదు మొహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచిన మ్యాచ్ ఇది. ఏకంగా 7 వికెట్లు తీసి షమీ చెలరేగిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు సాధించడం షమీకు ఇది మూడవసారి. ఇప్పటి వరకూ ఈ అరుదైన రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. ఇదే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, శ్రీలంకపై మొహమ్మద్ షమీ ఐదేసి వికెట్లు పడగొట్టాడు. ఈసారి 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లతో రికార్డు సృష్టించాడు.


మొహమ్మద్ షమీ రికార్డులు


వన్డే ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో ఫైవ్ వికెట్ హాల్ ఎక్కువ సార్లు సాధించిన తొలి బౌలర్. మొత్తం మూడు సార్లు ఈ ఘనత సాధించాడు.


అన్ని ప్రపంచకప్ వన్డేల్లో అత్యదికంగా ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ కూడా షమీనే. 4 సార్లు ఈ ఫీట్ సాధించి ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డు బ్రేక్ చేశాడు.


బెస్ట్ బౌలింగ్ ఎనాలిసిస్ రికార్డు కూడా మొహమ్మద్ షమీదే. 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ ఎనాలసిస్. గతంలో రోజర్ బిన్ని బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.


ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లలో 23 వికెట్ల పడగొట్టి జహీర్ ఖాన్ రికార్డు బ్రేక్ చేశాడు. 2011 ప్రపంచకప్‌లో జహీర్ ఖాన్ 21 వికెట్లు పడగొట్టాడు. 


Also read: India Vs New Zealand Highlights: కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. సెమీస్‌లో సూపర్ విక్టరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook