India Vs New Zealand Highlights: కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. సెమీస్‌లో సూపర్ విక్టరీ

IND vs NZ Highlights ICC World Cup 2023 Semifinal: సొంతగడ్డపై భారత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పూర్తి వివరాలు ఇలా..

Written by - Ashok Krindinti | Last Updated : Nov 15, 2023, 11:23 PM IST
India Vs New Zealand Highlights: కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. సెమీస్‌లో సూపర్ విక్టరీ

IND vs NZ Highlights ICC World Cup 2023 Semifinal: వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగులతో చిత్తు చేసి.. 2019 సెమీ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయాస్ అయ్యర్ (105) సెంచరీలతో దుమ్మురేపగా.. శుభ్‌మన్ గిల్ (80), రోహిత్ శర్మ (47), కేఎల్ రాహుల్ (39) రాణించడంతో భారీ స్కోరు చేసింది. అనంతరం కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (134) శతకంతో పోరాటం చేశాడు. విలియమ్సన్ (69), ఫిలిప్స్ (41) కాస్త భయపెట్టారు. మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగి.. న్యూజిలాండ్ భరతం పట్టాడు. షమీకే మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గురువారం సౌతాఫ్రికా-ఆసీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌తో ఈ నెల 19న భారత్ ఫైనల్‌లో తలడపనుంది. భారత్ ఫైనల్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. టపాసులు పేల్చుతూ.. జయహో భారత్ అంటూ నినదాలు చేస్తున్నారు. 

 

భారత్ విధించిన 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. డేవాన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర (13)లను మహ్మద్ షమీ ఔట్ చేయడంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాతే అసలు ఆట మొదలైంది. కెప్టెన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ.. ఆ తరువాత గేర్ మార్చి దూకుడుగా ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 149 బంతుల్లో 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్‌లో కాస్త భయం కనిపించింది.

ఈ సమయంలో షమీ మ్యాచ్‌ను ములుపు తిప్పాడు. ఒకే ఓవర్‌లో కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69, 9 ఫోర్లు, ఒక సిక్స్), టామ్ లాథమ్ (0)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. దీంతో 220 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ మరోసారి పైచేయి సాధించింది. అయితే గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి డారిల్ మిచెల్ పట్టువదలకుండా పోరాడాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 61 బంతుల్లో 75 పరుగులు జోడించారు. కానీ సాధించాల్సి రన్‌రేట్ పెరిగిపోవడంతో ఒత్తిడితో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా 43వ ఓవర్‌లో ఫిలిప్స్ (41)ను పెవిలియన్‌కు పంపించగా.. మార్క్ ఛాంప్‌మన్ (02)ను  కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. కాసేటికే డారిల్ మిచెల్ (119 బంతుల్లో 134, 9 ఫోర్లు, 7 సిక్స్‌లు)ను షమీ ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. చివరకు న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ (57/7) వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (117 పరుగుల అతిపెద్ద ఇన్నింగ్స్‌ను ఆడాడు, ఇది అతని వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ. ఇది కాకుండా శ్రేయాస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ప్రతీసారి మాదిరిగానే రోహిత్ శర్మ శుభారంభం అందించి 29 బంతుల్లో 47 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌  నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో విరాట్ కోహ్లీ 117 రన్స్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (70 బంతుల్లో 106, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వరుసగా రెండో శతకం బాదాడు. శుభ్‌మన్‌ గిల్ (66 బంతుల్లో 80, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆరంభంలో మెరుపులు మెరిపించగా.. చివర్లో కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివర్లో దుమ్ములేపాడు. న్యూజిలాండ్  బౌలర్లలో టిమ్ సౌథీ  100 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News