Dan Mousley Six: భారీ సిక్స్ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్.. బంతి అందుకుని పారిపోయిన ఫ్యాన్! నవ్వులు పూయించే వీడియో
Fan runs away with ball after Dan Mousley hits the ball out of Sharjah stadium. ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ బాదిన సిక్సర్ స్టేడియం బయటపడడంతో.. ఓ అభిమాని బంతిని అందుకుని పారిపోయాడు.
Fan ran away with ball at Sharjah Cricket ground after Dan Mousley hits Huge Six: టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద పారుతుంది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడానికి బ్యాటర్లు రెచ్చిపోతారు. బౌలర్ ఎవరైనా.. బంతి ఎలా వచ్చినా భారీ షాట్లు ఆడుతుంటారు. ఇక బంతి లైన్ తప్పితే బౌండరీ ఖాయం. హిట్టర్లు అయితే ప్రతి బంతిని బౌండరీ ఆవలకు పంపేందుకే చూస్తారు. ఈ క్రమంలో కొందరు ప్లేయర్స్ బంతిని బలంగా బాదడంతో.. అది కాస్త స్టేడియం ఆవల పడుతుంటుంది. తాజాగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2023లో అదే జరిగింది. ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ బాదిన సిక్సర్ స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం (జనవరి 29)న డెసర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆండ్రీ ఫ్లెచర్ (50; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ముహమ్మద్ వసీం (86; 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు).. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (50 నాటౌట్; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇన్నింగ్స్ చివరలో డాన్ మూస్లీ (31 నాటౌట్; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు.
ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ భారీ సిక్సర్ బాదడంతో.. బంతి షార్జా స్టేడియం బయట పడింది. స్టేడియం బయట పడిన బంతి రోడ్డు మీద పడింది. ఇది గమనించిన ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి బంతిని తీసుకున్నాడు. బంతిని చేతితో పట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. వీడియో చూసిన ఫాన్స్, నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు. అనంతరం కీరన్ పొలార్డ్ కూడా భారీ సిక్సర్ బాదడంతో బంతి స్టేడియం బయట పడింది. అయితే ఈసారి ఒక వ్యక్తి బంతిని మైదానంలోకి విసిరాడు.
ఈ మ్యాచులో ఎంఐ ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో గెలిచింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్ 12.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. టామ్ కర్రాన్ (12), మార్క్ వాట్ (12), కోలిన్ మున్రో (10) మాత్రమే డబుల్ డిజిట్ అందుకున్నారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్స్ తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Prithvi Shaw vs Shubman Gill: వన్డేలకు గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారు: మాజీ ఓపెనర్
Also Read: OLX Layoffs: ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్.. 1500 మంది ఉద్యోగులపై వేటు! భారత్‌లో కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.