IND Playing 11 vs AUS for 2nd T20: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్‌ నాగ్‌పూర్ వేదికగా నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌‌ రోహిత్ సేనకు చావోరేవో లాంటిది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే.. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే మరో మ్యాచ్ మిగిలుండగానే పొట్టి సిరీసును ఆస్ట్రేలియాకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 'డెత్‌' ఓవర్ల సమస్యను అధిగమించాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ 2022 నుంచి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా 19వ ఓవర్ వేస్తూ భారత్ ఓటమికి కారణమయ్యాడు. మరోవైపు హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్ కూడా విఫలమయ్యారు. భువీ కొనసాగినా.. హర్షల్, ఉమేష్‌లపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఉమేష్‌ స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అలానే హర్షల్  స్థానంలో దీపక్ చహర్ ఆడే అవకాశం ఉంది. బుమ్రా, భువీ, దీపక్ ఆడితే.. భారత్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. 


తొలి టీ20లో దారుణంగా విఫలమైన మణికట్టు యుజ్వేంద్ర చహల్ రెండో మ్యాచ్ ఆడటంపై అనుమానమే. ఆసియాకప్ 2022 ముందు నుంచి కూడా యూజీ భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. దాంతో సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఇక బ్యాటింగ్‌లో దాదాపుగా మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,  దినేశ్‌ కార్తిక్, అక్షర్‌ పటేల్ ఆడనున్నారు. 


భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్. 


Also Read: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?


Also Read: భలే స్కెచ్చేసిన మాస్ మహా రాజా.. తమిళ హీరోలకు పోటీగా రంగంలోకి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.