India vs West Indies Dream11 Prediction 4th T20I: భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య మొదటి మూడు టీ20లు వెస్టిండీస్‌ గడ్డపై జరగ్గా.. మిగిలిన రెండు మ్యాచులు అమెరికాలో జరగనున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్‌తో జరిగే నాలుగో టీ20లో భారత్ తలపడనుంది. ఫ్లోరిడాలోని లాండర్‌హిల్‌ సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు జరిగే మ్యాచులో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలనే పట్టుదలతో విండీస్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టీ20 ఆడుతుండగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో మిగిలిన టీ20లతో పాటు ఆసియా కప్‌ 2022కు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే హిట్‌మ్యాన్‌ వెన్నునొప్పి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. శనివారం జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడట. సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా రానున్నాడు. 


తొలి టీ20లో స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యార్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచులో 10 రన్స్ చేసిన అయ్యర్.. మూడో మ్యాచులో 24 పరుగులు చేశాడు. దాంతో సెంచరీ హీరో దీపక్ హుడాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మూడో మ్యాచులో రోహిత్ స్థానంలో ఆడిన దీపక్ 10 రన్స్ చేశాడు. రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇస్తే తప్ప.. సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం లేదు. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజాలు మిడిల్ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఆడనున్నారు.  


తుది జట్టు (అంచనా): 
రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్. 


డ్రీమ్ 11 టీమ్ ఇదే:
నికోలస్ పూరన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మెయర్, కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అకేల్ హోసేన్, అర్ష్‌దీప్ సింగ్. 


Also Read: కంటెంట్‌ బాగుంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు! చిరంజీవి ట్వీట్ వైరల్


Also Read: లైగర్‌ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌.. విజ‌య్‌ దేవరకొండ, అన‌న్య పాండే కెమిస్ట్రీ అదుర్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook