భారత్ 17 పరుగులు.. 3 వికెట్లు
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 11.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు తీసింది. శ్రీలంక బౌలర్ లక్మల్ ఓపెనర్ లోకేష్, శిఖర్ ధావన్, కోహ్లీని అవుట్ చేసాడు.
గురువారం ఉదయం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో భారత్-శ్రీలంక మొదటి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. బరిలో దిగిన భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. లోకేష్ రాహుల్ లంక బౌలర్ లక్మల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతరువాత బరిలో దిగిన శిఖర్ ధావన్ 8 పరుగులు తీసి మరోసారి లక్మల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. కోహ్లీ కూడా పరుగులేవీ చేయకుండా మళ్లీ శ్రీలంక బౌలర్ లక్మల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 11.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు తీసింది. శ్రీలంక బౌలర్ లక్మల్ ఓపెనర్ లోకేష్, శిఖర్ ధావన్, కోహ్లీ ని అవుట్ చేసాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మీదే భారత జట్టు ఆధారపడి ఉంది. పుజారా, రహానె ఎంతసేపు క్రీజులో నిలుస్తారో చూడాల్సి ఉంది.