India vs Afghanistan Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కీలక మ్యాచ్‌లకు సిద్దమైంది. గ్రూపు దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. టాప్ ప్లేస్‌తో సూపర్-8కు చేరుకుంది. గ్రూపు దశలో యూఎస్‌ఏలో ఆడిన భారత్.. సూపర్-8 మ్యాచ్‌లను విండీస్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో నేడు అప్ఘానిస్థాన్‌తో తలపడనుంది. విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో టీమిండియా ప్లేయింగ్‌ 11లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓపెనర్‌గా విఫలమవుతున్న విరాట్ కోహ్లీని వన్‌డౌన్‌లో ఆడించే ఛాన్స్ ఉంది. ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు చోటు కల్పించవచ్చు. అదేవిధంగా మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. అటు రషీద్ ఖాన్ సారథ్యంలోని అఫ్ఘనిస్థాన్ జట్టు మూడింటిలో గెలుపొంది.. సూపర్-8 రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: PM Modi: జమ్ములో రెండు రోజుల పాటు మోదీ పర్యటన.. ఈ సారి యోగా డే థీమ్ ఏంటో తెలుసా..?


కెన్సింగ్టన్ ఓవల్‌ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తుంది. అయితే బ్యాట్స్‌మెన్లు కూడా చక్కగా రాణిస్తున్నారు. అప్ఘాన్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీలను బ్యాటర్లు ధీటుగా ఎదుర్కొంటే విజయం మనదే. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరిగాయి. ఏడింటిలోనూ టీమిండియానే గెలుపొందింది. మరోసారి భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్/శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.


అప్ఘానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ


IND Vs AFG Dream11 Prediction Team Tips


==> వికెట్ కీపర్: రహ్మానుల్లా గుర్బాజ్, రిషబ్ పంత్
==> బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇబ్రహీం జద్రాన్.
==> ఆల్ రౌండర్: అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.
==> బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫజల్హాక్ ఫరూకీ.


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter