Afghanistan Match Fixing: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!
Match Fixing Allegations Against Afghanistan players vs India. భారత్ vs అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతూన్నారు.
Match Fixing Allegations Against Afghanistan players vs India: ఆసియా కప్ 2022లో భారత్ ఫైనల్‌కు వెళ్లడంలో విఫలమైనప్పటికీ.. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారీ విజయంతో టోర్నీని ఘనంగా ముగించింది. నామమాత్రమైన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ (122 నాటౌట్; 61 బంతుల్లో 12×4, 6×6) చేయగా.. కేఎల్ రాహుల్ (62; 41 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ (5/4) ధాటికి అఫ్గాన్ 8 వికెట్లకు 111 పరుగులే చేసి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతూన్నారు.
ఈ మ్యాచులో భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. భువీ వేసే బంతులకు అఫ్గానిస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలబడేందుకు ఇబందిపడ్డారు. అయితే అజ్మతుల్లా ఓమర్జయ్ ఇచ్చిన క్యాచ్ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. భువనేశ్వర్ బౌలింగ్‌లో సునాయాస ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిగో క్యాచ్ అందుకో అన్నట్లుగా డిస్క్ కార్తీక్‌కుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది నెటిజన్ల కంట పడింది.
సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. 28 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ కావాల్సింది. మహమ్మద్ నబీ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా విరాట్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద ఉన్న ఇబ్రహీం జాద్రన్ క్యాచ్ మిస్ చేశాడు. క్యాచ్ అందుకునే వీలున్నా అతడు పట్టలేదు. అంతేకాదు అది సిక్స్ వెళ్లిపోయింది. ఈ క్యాచ్ వదిలేసిన విధానం చూస్తే.. కావాలని వదిలేసి ఉంటాడని ప్రతిఒక్కరు అనుకోక మానరు. అలానే రిషబ్ పంత్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ముజీబ్ ఉర్ రెహ్మన్ వదిలేశాడు. అంతేకాకుండా అవి రెండు కూడా బౌండరీలకు వెళ్లాయి.
ఈ ఘటనల నేపథ్యంలో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు అని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో 'ఫిక్సింగ్' అని ట్రెండింగ్ అవుతోంది. అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసారు అని ఒకరు కామెంట్ చేయగా.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా అని ఇంకొకరు ట్వీట్ చేశారు. బీసీసీఐ నుంచి భారీగా డబ్బులు అందాయేమో.. ఇక అఫ్గానిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్ కాంట్రాక్టు పక్కా, వెల్ పెయిడ్ ఇండియా, అఫ్గానిస్థాన్ వైస్ భారత్ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: Balapur Ganesh Laddu: పోటాపోటీగా సాగిన వేలంపాట.. రికార్డు ధర పలికిన బాలపూర్ లడ్డూ!
Also Read: Virat kohli Records: విరాట్ కోహ్లీ 71వ సెంచరీ.. నమోదైన టాప్ రికార్డులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook