Balapur Ganesh Laddu Price: పోటాపోటీగా సాగిన వేలంపాట.. రికార్డు ధర పలికిన బాలపూర్‌ లడ్డూ!

Vangeti Lakshma Reddy wins 2022 Balapur Ganesh Laddu. బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మా రెడ్డి బాలాపూర్‌ లడ్డూను రూ. 24.60లక్షలకు దక్కించుకున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 9, 2022, 11:44 AM IST
  • పోటాపోటీగా సాగిన వేలంపాట
  • రికార్డు ధర పలికిన బాలపూర్‌ లడ్డూ
  • ఘనంగా గణేశుడి శోభాయాత్ర
Balapur Ganesh Laddu Price: పోటాపోటీగా సాగిన వేలంపాట.. రికార్డు ధర పలికిన బాలపూర్‌ లడ్డూ!

Vangeti Lakshma Reddy wins 2022 Balapur Ganesh Laddu for Rs 24.60 lakhs: భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ. ప్రతి ఏడాది నిమజ్జనం రోజున బాలాపూర్‌ లడ్డూను దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం పాట సాగుతుంది. దాంతో బాలాపూర్‌ లడ్డూ వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షలు పలుకుతుంది. ప్రతి ఏటా ఈ లడ్డూ ధర రికార్డులను చెరిపేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలో 2022లో కూడా బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా రూ. 24.60 లక్షల ధరకు అమ్ముడు పోయింది. 

బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మా రెడ్డి బాలాపూర్‌ లడ్డూను రూ. 24.60లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీపడడంతో.. వేలం పాట జోరుగా సాగింది. మొత్తంగా 9 మంది వేలంలో పాల్గొనడంతో పాట రసవత్తరంగా సాగింది. చివరికి లక్ష్మా రెడ్డి బాలపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది బాలపూర్‌ లడ్డూ 18 లక్షల 90 వేలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. 

శుక్రవారం ఉదయం బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలం పాట కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక నేతలు హాజరయ్యారు. మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు వేలం పాట చూడడానికి వచ్చారు. దాంతో బాలాపూర్‌ ప్రధాన కూడలిలో సందడి వాతావరణం నెలకొంది. వేలం పాట అనంతరం వంగేటి లక్ష్మా రెడ్డి లడ్డూను ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు బాలాపూర్‌ వీధుల్లో గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది.

Also Read: Virat kohli Records: విరాట్ కోహ్లీ 71వ సెంచరీ.. నమోదైన టాప్ రికార్డులు ఇవే!

Also Read: Virat Kohli Century: ఈ సెంచరీ నీకే అంకితం.. మైదానంలో ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News