KS Bharat and Suryakumar Yadav debuting in Test: క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య తొలి టెస్టు గురువారం ఉదయం 9.30 మొదలవనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాడ్‌ మర్ఫీకి తొలిసారి ఆస్ట్రేలియా తరఫున టెస్టు ఆడే అవకాశం లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023) తొలి టెస్టులో ఇద్దరు భారత ప్లేయర్స్ అరంగేట్రం చేశారు. టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ తొలిసారి భారత తుది జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్‌ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. దాంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. సూర్యకుమార్‌ ఎంట్రీతో ఇటీవల సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్‌కు చోటు గళ్ళైతైంది. భరత్‌ రాకతో ఇషాన్ కిషన్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్లో స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌ మరింత కీలకం కానుంది. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే.. టీమిండియా డబ్ల్యూటీసీ టైటిల్‌ సమరానికి అర్హత సాధించగలుగుతుంది. దాంతో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్ కీలకమే. అంతేకాదు గత పరాభవాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది.  


తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్. 


Also Read: Hyderabad Traffic 2023: హైదరాబాద్‌లో మరో 10 రోజులు ట్రాఫిక్‌ జామ్‌లే.. వాహనదారులు నరకం చూడక తప్పదు!  


Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీని ఆపకుంటే.. ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.