Greg Chappell feels Virat Kohli Will Have A Major Impact On BGT 2023: స్వదేశంలో శ్రీలంక, న్యూజీలాండ్ జట్లపై ఆధిపత్యం చెలాయించిన భారత్.. మరో రసవత్తర సమరానికి సిద్దమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో తొలి టెస్టు ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. విజయంతో శుభారంభం చేసి సిరీస్‌లో పైచేయి సాధించాలని రెండు జట్లు చూస్తున్నాయి. మరి స్పిన్‌కు విపరీతంగా సహకరిస్తుందని భావిస్తున్న నాగపూర్ పిచ్‌పై పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 బెర్తుపై కన్నేసిన భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే.. టీమిండియా డబ్ల్యూటీసీ టైటిల్ సమరానికి అర్హత సాధించగలుగుతుంది. సిరీస్ భారత్‌లో జరుగుతుండటంతో.. ఆసీస్ విజయం సాధించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు భారత్‌ను భారత్‌లో ఓడించడానికి ఇదే మంచి అవకాశమని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ స్పందించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. గ్రెగ్ చాపెల్ బోరియా షోల మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ అద్భుత ఆటగాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ ముందున్నాడు. పెద్ద సిరీస్‌లలో బాగా ఆడాలని ఎపుడూ చూస్తుంటాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై గెలవాలని ప్రతీసారి కోరుకుంటాడు. ఆస్ట్రేలియాపై విరాట్ కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాను అతడు అతిపెద్ద సవాల్‌గా భావిస్తాడు' అని అన్నాడు.
'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023పై విరాట్ కోహ్లీ గట్టి ప్రభావాన్ని చూపుతాడు. కోహ్లీ భారీగా పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను గెలవడం చాలా కష్టం. ఆస్ట్రేలియా బౌలర్లు కోహ్లీని భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంటే.. అప్పుడు విజయావకాశాలు మెరుగవుతాయి. చివరగా చెప్పేది ఒక్కటే.. కోహ్లీ బ్యాటింగ్ సిరీస్‌పై గట్టి ప్రభావం చూపుతుంది' అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న కోహ్లీ మరోసారి ఆధిక్యం సాధించాలని చూస్తున్నాడు. తొలి టెస్ట్‌లో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
Also Read: బుధాదిత్య యోగం 2023.. ఈ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో విజయం! ఇందులో మీరు ఉన్నారా
Also Read: Malavika Menon Pics: శారీలో మాలవిక మీనన్.. మలయాళం బ్యూటీ మత్తెక్కించే అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.