India vs Australia T20 Series Full Schedule, Live Streming Deatils: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ చేసుకునేందుకు భారత జట్టుకు ఇదే మంచి అవకాశం. మంగళవారం (సెప్టెంబర్ 20) నుంచి భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ ఆడనున్నాయి. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా టీమ్ గత వారమే భారత్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు తొలి మ్యాచ్‌ జరగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా జట్లు పటిష్టంగా ఉండడంతో మూడు మ్యాచులు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారు. ఈ ఇద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. రాహుల్ చివరి మ్యాచులో హాఫ్ సెంచరీ చేయడం సానుకూలాంశం. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఫామ్‌ అందుకోవడం జట్టుకు పెద్ద ప్లస్. సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, రిషబ్ పంత్/దినేశ్‌ కార్తిక్‌ కూడా పరుగులు చేస్తే టీమిండియాకు తిరుగుండదు. ఆల్‌రౌండర్‌ కోటాలో అక్షర్ పటేల్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. 


సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాడు. అలాగే యువ పేసర్ హర్షల్‌ పటేల్ జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌ 2022 జట్టులో ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, హర్షల్‌ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. భువనేశ్వర్‌ కుమార్ జట్టుకు అందుబాటులో ఉండడం పెద్ద ఊరట. దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ఉమేశ్‌ యాదవ్‌తో బౌలింగ్‌ దళం పటిష్ఠంగానే ఉంది. ప్రపంచకప్‌ 2022కు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ చేసుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం. 


భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహాలీ వేదికగా జరగనుంది. రెండో టీ20 నాగ్‌పుర్ వేదికగా సెప్టెంబర్ 23, మూడో టీ20 హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్ 25న జరగనుంది. ప్రతి మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచులు స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్‌ కానుంది. 


Also Read: యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ


Also Read: Varun Tej 13: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూవీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.