Mitchell Starc 5 Wickets help Australia beat India in 2nd ODI: విశాఖపట్నం వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత్ నిర్ధేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (51 నాటౌట్; 30 బంతుల్లో 10 ఫోర్లు), మిచెల్ మార్ష్‌ (66 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు. 6 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ ఓపెనర్లు సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ.. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ విజేతగా నిలుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి శుభారంభం దక్కింది. మొద‌టి వ‌న్డేలో మెర‌పు ఇన్నింగ్స్ ఆడిన మిచెల్ మార్ష్.. రెండో వ‌న్డేలోనూ జోరు కొన‌సాగించాడు. బౌండ‌రీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వేగంగా రన్స్ చేశాడు.  ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిదో ఓవ‌ర్‌లో మూడు సిక్స్‌లు బాది.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్ష్ 29 బంతుల్లోయాభైకి చేరువ‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా ఆడి అర్ధ శ‌త‌కం బాదడంతో ఆస్ట్రేలియా 11 ఓవ‌ర్ల‌కే లక్ష్యాన్ని చేరింది.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన‌ టీమిండియా 117 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దాంతో స్వ‌దేశంలో మూడో అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెల‌రేగిపోయాడు. స్టార్క్ ధాటికి భారత టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. తొలి ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (0)ను ఔట్ చేసిన స్టార్క్.. ఆ త‌ర్వాత‌ ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ‌ (13), సూర్య‌కుమార్ యాద‌వ్ (0)ను ఎల్బీగా వెన‌క్కి పంపాడు. ఇక కేఎల్ రాహుల్‌ (9)ను కూడా ఔట్ చేసి భార‌త్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 



క్రీజులో కుదురుకున్న‌ విరాట్‌ కోహ్లీ (31)ని నాథన్ ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు. అప్ప‌టికి భార‌త్ స్కోర్ 71/6 మాత్రమే. ఒక ద‌శ‌లో 100 ప‌రుగుల లోపే భారత్ ఆలౌట్ అయ్యేలా క‌నిపించింది. అయితే ర‌వీంద్ర జ‌డేజా (16), అక్ష‌ర్ ప‌టేల్ (29) ఆదుకోవడంలో భారత్ స్కోర్ 100 దాటింది. సీన్ అబాట్ ఒకే ఓవ‌ర్‌లో కుల్దీప్ యాద‌వ్ (4), మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ (0)ని ఔట్ చేశాడు. మొహ్మద్ సిరాజ్‌ను మిచెల్ స్టార్క్ బౌల్డ్ చేయ‌డంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్టార్క్ ఐదు వికెట్స్ పడగొట్టగా.. అబాట్ మూడు  వికెట్లు తీశాడు.


Also Read: IND vs AUS: భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌లో స్టార్ హీరో సందడి.. రోహిత్‌, కోహ్లీలకు ప్రత్యేక పేర్లు పెట్టాడుగా!  


Also Read: Cheapest Smartphone 2023: రూ 21 వేల స్మార్ట్‌ఫోన్‌ కేవలం 899కే.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.