India vs Australia 2nd T20 Live Streming Deatils: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది కాబట్టి.. నాగ్‌పూర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి రావాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పుర్ వేదికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ సాయత్రం 6.30 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్‌ కానుంది. ఇక శుక్రవారం నాగ్‌పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. తేమ 78 శాతం ఉంటుందని అంచనా. టాస్‌పై మంచు ప్రభావం చూపించొచ్చని తెలుస్తోంది. ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు లాభించనుంది. 


నాగ్‌పూర్‌లో భారత్ మొత్తం 4 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. శ్రీలంక, న్యూజిలాండ్‌ల చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2019లో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ చివరి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్. 


Also Read: బుమ్రా, చహర్ ఇన్.. ఉమేశ్, హర్షల్ ఔట్! ఆస్ట్రేలియాతో తలపడే భారత్ తుది జట్టు ఇదే


Also Read: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.