IND vs AUS 3rd ODI Tickets: భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే.. టికెట్స్ కోసం ఫాన్స్ బారులు! దుప్పట్లు కప్పుకుని క్యూ లైన్‌లోనే కునుకు
2KM queue line at mid night in Chennai for India vs Australia 3rd ODI Tickets. సిరీస్ డిసైడర్ అయిన చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు.
Chennai Cricket Fans sleeping in long queue line for India vs Australia 3rd ODI Tickets: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపుతారు. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు మొత్తం అభిమానులతో నిండిపోతాయి. టెస్టు క్రికెట్‌కు చూడడానికి కూడా ప్రేక్షకులు మైదానాలకు క్యూ కడుతుంటారు. అలాంటిది భారత్, ఆస్ట్రేలియా మ్యాచును చూడకుండా ఎవరుంటారు?. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో మార్చి 22న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. దాంతో చెన్నై వన్డే కీలకంగా మారింది. అయితే సిరీస్ డిసైడర్ అయిన చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే స్టేడియం టికెట్ కౌంటర్ల వద్దకు క్యూలు కట్టారు. దాంతో రెండు కిలోమీటర్ల మేర క్యూ నిలిచింది. క్యూ లైన్‌లోనే కొందరు ఫాన్స్ దుప్పట్లు కప్పుకొని కునుకు తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా చాలా నెలలుగా ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచులు జరగకపోవడంతో టికెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్ భారీగా ఉందట. ఎలాగైనా భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్ చూడాలని ఫాన్స్ ఆరాటపడుతున్నారు. భారత స్టార్ విరాట్ కోహ్లీని చూసేందుకు ఫాన్స్ ఆరాటపడుతున్నారట. కింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఇది ఐ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేలు పూర్తి 50 ఓవర్లు జరగలేదు. చెన్నైలో అయినా హై స్కోరింగ్ మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ ఫోటో చూసి టిక్కెట్ల కోసం క్యూలో వేచి ఉన్న ఓ ఫ్యాన్ తమ అనుభవాన్ని పంచుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్ కోసం క్యూలో వేచి ఉన్న తన బాధాకరమైన అనుభవాన్ని ట్విట్టర్ వినియోగదారు గుర్తు చేసుకున్నారు. 'దురదృష్టవశాత్తూ చెన్నైలో ప్రతిసారీ అభిమానులకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పేలవమైన ఏర్పాట్లు ఉంటాయి. భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఏడు గంటల పాటు క్యూలో వేచి ఉండటం నాకు గుర్తుంది. అయినా కూడా టిక్కెట్ దొరకలేదు' అని అతను పేర్కొన్నాడు.
Also Read: Suryakumar Yadav Trolls: పరుగులు చేయకున్నా సూర్యకుమార్‌కే ఛాన్సులు.. సంజూ శాంసన్ ఏం పాపం చేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.