Suryakumar Yadav Trolls: పరుగులు చేయకున్నా సూర్యకుమార్‌కే ఛాన్సులు.. సంజూ శాంసన్ ఏం పాపం చేశాడు!

Sanju Samson Fans Trolls Suryakumar Yadav after Duck in IND vs AUS 2nd ODI. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యను తీసుకునే బదులుగా సంజూ శాంసన్‌ను ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 19, 2023, 07:25 PM IST
  • పరుగులు చేయకున్నా సూర్యకుమార్‌కే ఛాన్సులు
  • సంజూ శాంసన్ ఏం పాపం చేశాడు
  • బాధపడుతున్న సంజూ ఫ్యాన్స్
Suryakumar Yadav Trolls: పరుగులు చేయకున్నా సూర్యకుమార్‌కే ఛాన్సులు.. సంజూ శాంసన్ ఏం పాపం చేశాడు!

Sanju Samson Fans brutally Trolls BCCI after Suryakumar Yadav another Duck IND vs AUS ODI Series: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్, ఆపై బౌలింగ్‌లో తేలిపోయి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్‌ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (51 నాటౌట్; 30 బంతుల్లో 10 ఫోర్లు), మిచెల్ మార్ష్‌ (66 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు. 6 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆస్ట్రేలియాకు సునాయాస విజయాన్ని అందించారు. ఇద్దరు కలిసి  66 బంతుల్లో 121 పరుగులు చేశారు. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (0) డకౌట్ కాగా.. కాసేపటికే సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (13) పెవిలియన్ చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యాడు. టీ20లలో నిరోపించుకుని వన్డే జట్టులో చోటు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న సూర్య.. కీలక నాలుగో స్థానంలో వచ్చి చేతులెతేశాడు. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు డకౌట్ అయ్యాడు. ముంబై, విశాఖ వన్డేలలో సూర్య డకౌట్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ మండిపడుతున్నారు. 

వెన్నుగాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ వన్డే సిరీర్‌కు దూరం అయిన విషయం తెలిసిందే. వన్డేల్లో రాణిస్తూ నాలుగో స్థానానికి సరైనోడుగా నిరూపించుకున్న అయ్యర్.. ఈ సిరీస్‌కు దూరమవడం భారత్ విజయంపై ప్రభావం చూపింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ ఉండుంటే.. ఇన్నింగ్స్ చక్కిదిద్దే వాడని ఫ్యాన్స్ నెట్టింట అంటున్నారు. అదే సమయంలో అయ్యర్ స్థానంలో సూర్యను తీసుకునే బదులుగా సంజూ శాంసన్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఆడకున్నా సూర్యకు పదేపదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని, బీసీసీఐ సంజూపై ఎందుకు పక్షపాతాన్ని చూపుతుందో అని కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో గాయపడిన సంజూ  శాంసన్‌.. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్ 2032 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల పరుగులు చేస్తున్న సంజూకి మాత్రం టీమిండియా నుంచి పిలుపు మాత్రం దక్కడం లేదు. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో సంజూకి చోటు దక్కే అవకాశం ఉందని ఈ ఏడాది ఆరంభంలో సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. సంజూను కావాలనే సైడ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Also Read: IND vs AUS: భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌లో స్టార్ హీరో సందడి.. రోహిత్‌, కోహ్లీలకు ప్రత్యేక పేర్లు పెట్టాడుగా!  

Also Read: IND vs AUS 2nd ODI: వైజాగ్ వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం.. 11 ఓవర్లలోనే ముగించిన ఆస్ట్రేలియా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News