India vs Australia Highlights: మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
IND Vs AUS 3rd T20 Full Highlights: భారత్ విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాక్స్‌వెల్ (104) ఒంటిచెత్తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీ వృథా అయింది.
IND Vs AUS 3rd T20 Full Highlights: టీమిండియా జోరుకు ఆసీస్ చెక్ పెట్టింది. మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలన్న భారత్‌కు కంగారూలు షాకిచ్చారు. నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో ఆసీసీ ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను మ్యాక్స్‌వెల్ (104) ఒంటిచెత్తో విజయ తీరానికి చేర్చాడు. చివరి ఓవర్‌లో 12 బంతుల్లో 43 పరుగులు అవసరం అవ్వగా.. 19వ ఓవర్‌లో 22, 20 ఓవర్‌లో 23 పరుగులు పిండుకుని ఆసీస్ విక్టరీ సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-2 గా నిలిచింది.
టీమిండియా విధించిన 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ట్రావిస్ హెడ్ (35), ఆరోన్ హార్డీ (16) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఆరోన్ హార్డీని ఔట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ జట్టుకు బ్రేక్ చేశాడు. ఆరో ఓవర్ నాలుగో బంతికి హెడ్‌ను అవేష్ ఖాన్ రెండో దెబ్బ తీశాడు. కాసేపటికే జోస్ ఇంగ్లిస్ (10)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో 68 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 41 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడిని అక్షర్ పటేల్ 13వ ఓవర్లో స్టోయినిస్ (17)ను ఔట్ చేసి విడదీశాడు. తరువాతి ఓవర్‌లోనే టిమ్ డేవిడ్ (0)ను ఔట్ చేయడంతో భారత్ రేసులోకి వచ్చింది. ఆ తరువాత కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ (28 నాటౌట్) అండతో మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104, 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. ఎడపెడా సిక్సర్లు బాదుతూ లక్ష్యానికి చేరువా తీసుకువచ్చాడు. చివరి ఓవర్‌లో 43 పరుగులు అవసరం అవ్వగా.. అక్షర్ పటేల్ వేసిన 19 ఓవర్‌లో 22 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్‌లో 21 రన్స్ కావాల్సి ఉండగా.. ప్రసిద్ధ్ కృష్ట వేసిన ఆ ఓవర్‌లో మ్యాక్సీ చెలరేగాడు. తాను సెంచరీ బాదడంతోపాటు జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఓవర్‌లో 23 పరుగులు పిండుకున్నారు. భారత బౌలర్లలో బిష్టోయ్ 3, అవేశ్ ఖాన్ 2, ప్రసిద్ధ్ కృష్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే జైస్వాల్ (6) వికెట్ కోల్పోయింది. కాసేపటికే ఇషాన్ కిషన్ కూడా డకౌట్ అయ్యాడు. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 నాటౌట్, 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ బాదగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు) వేగంగా ఆడారు. చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు రుతురాజ్. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్, బెహండ్రాఫ్, హార్డి తలో వికెట్ తీశారు. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Telangana Election 2023: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, చివరిరోజు పీక్స్‌కు ప్రచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి