IND vs AUS 3rd Test Day 1 Highlights: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా మూడో టెస్టులో మాత్రం ఆతిథ్య భారత జట్టుకు గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు (బుధవారం) ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పీటర్‌ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్‌ గ్రీన్‌ ( 6) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్‌ ఖవాజా (60) హాఫ్ సెంచరీతో మెరిశాడు. లబుషేన్‌ (31), స్టీవ్ స్మిత్ (26) అతడికి సహకారం అందించారు. భారత బౌలర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ శుభారంభం అందించారు. ఓపెనర్లు  క్రీజులో ఉన్నంతసేపూ వేగంగా పరుగులు వచ్చాయి. దీంతో భారత్ భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. ఆరో ఓవర్‌లో మాథ్యూ కుహ్నెమన్‌.. రోహిత్‌ని ఔట్‌ చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఎనిమిదో ఓవర్‌లో గిల్ (21)ని కుహ్నెమన్‌ వెనక్కి పంపగా.. కాసేపటికే నాథన్ లైయన్‌ బౌలింగ్‌లో ఛెతేశ్వర్‌ పుజారా (1) పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్‌ (0) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.


కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకుంటాడనుకున్న స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (22; 52 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచాడు. టాడ్‌ మార్ఫీకి కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. యువ ప్లేయర్ కేఎస్ భరత్ (17) మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. స్టార్ ఆల్‌రౌండర్‌లు అక్షర్ పటేల్ (12), ఆర్ అశ్విన్ (3) త్వరగానే ఔట్ కాగా.. మొహ్మద్ సిరాజ్ (0) డకౌట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ మాత్రం కీలక 17 పరుగులు చేసి జట్టు స్కోరును 100 దాటించాడు. 


తొలి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆస్ట్రేలియా త్వరగానే మొదటి వికెట్ కోల్పోయింది. ఆర్ జడేజా వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతికి ట్రావిస్‌ హెడ్ (9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మార్నస్ లబుషేన్‌ ఔట్ అయిన బంతి నో బాల్ కావడంతో అతడు బతికిపోయాడు. దాంతో ఉస్మాన్‌ ఖవాజాకు లబుషేన్‌ (31) మంచి సహకారం అందించాడు. స్టీవ్ స్మిత్ (26) కూడా క్రీజులో నిలవడంతో ఆసీస్ మెరుగైన స్కోర్ చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 


Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. ఇక టాటా పంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం!  


Also Read: Cheapest Electric Cars 2023: చీపెస్ట్ 3 ఎలక్ట్రిక్ కార్స్ ఇవే.. పూర్తి ఛార్జీతో 320 కిమీ ప్రయాణం!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.