IND Vs Aus 4th Test Day 3 Score Updates: అహ్మదాబాద్‌లో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా జవాబిస్తోంది. మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగి ఆడాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఓవర్ నైట్ స్కోరు 36 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (35) పరుగులు చేసి ఔట్ అవ్వగా.. మరో ఎండ్‌లో గిల్ మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ సెంచరీతో కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన రాహుల్ స్థానంలో గిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలో ఘోరంగా ఫ్లాప్ అవుతున్నాడు. అయినా టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం వరుసగా అవకాశాలు ఇస్తోంది. గత 6 టెస్టు మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ సగటు 15.90 మాత్రమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి రెండు మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వగా.. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మూడో టెస్టుకు రాహుల్‌ను పక్కనబెట్టి గిల్‌కు అవకాశం ఇచ్చారు. 


ఇండోర్ టెస్టులో శుభ్‌మన్ గిల్ కూడా విఫలం అవ్వగా.. అహ్మదాబాద్ టెస్టులో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఈ సెంచరీ గిల్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఆసీస్ భారీ స్కోరు చేయడంతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి నెలకొంది. ఆ ఒత్తిడిని గిల్ అలవోకగా అధికమించుతూ.. తొలి వికెట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హిట్‌మ్యాన్ ఔట్ అయిన తరువాతరెండో వికెట్‌కు ఛెతేశ్వర్ పుజారాతో కలిసి 113 పరుగుల జోడించాడు. ఇటీవల వన్డే, టీ20 క్రికెట్‌లో సత్తా చాటుకోవడంతో ఇక మూడు ఫార్మాట్‌లలోనూ ఓపెనర్‌గా ఫిక్స్ అయిపోయాడు. 


అన్ని ఫార్మాట్‌లలో వరుసగా విఫలమవుతున్నా కేఎల్‌ రాహుల్‌కు వరుస అవకాశాలు ఇవ్వడంపై అన్ని వైపులా నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ముందుగా అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. మూడు, నాలుగో టెస్టుల్లో బెంచ్‌కే పరిమితం చేసింది. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనూ రాహుల్ విఫలమైతే.. ఇక సర్దుకోవాల్సిందేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ దేశవాళ్లీ టోర్నీలు ఆడుకుని.. ఫామ్‌ను చాటుకోవాల్సి ఉంటుంది. 


అహ్మదాబాద్‌లో టెస్టులో భారత్‌ కూడా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. శుభ్‌మన్ గిల్ (128) పరుగులు చేయగా.. పుజారా (42) రన్స్ చేశాడు. దీంతో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (53), రవీంద్ర జడేజా (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 208 పరుగులు వెనకబడి ఉంది.  


Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!


Also Read: Meta Layoffs: మరోసారి షాక్ ఇవ్వనున్న మెటా.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి