MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

MLC Kavitha in Delhi Liquor Scam: రోజుకో మలుపు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతోంది..? ఇందులో ఎవరెవరు ఇరుకున్నారు..? ఎమ్మెల్సీ కవిత పాత్ర ఎంత వరకు ఉంది..? శనివారం విచారణ సందర్భంగా ఏం జరగనుంది..? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2023, 02:54 AM IST
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ.. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనుంది. మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కవిత పేరును కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈడీ విచారణ సందర్భంగా ఏం జరుగుతోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గతేడాది ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కొత్త రూల్ తీసుకువచ్చింది. లిక్కర్ సేల్స్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ పాలసీని మార్చింది. ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయ‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి, శ‌ర‌త్‌చంద్రా రెడ్డిలు సౌత్ గ్రూప్‌గా ఏర్పడి.. ఢిల్లీలో మద్యం అమ్మకాలను దక్కించుకున్నారు. తమ కంపెనీ ద్వారా ఢిల్లీలో వీరు మద్యాన్ని రవాణా చేస్తారు. 

ఢిల్లీలో మద్యం అమ్మకాల్లో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ దక్కించుకుందని ఈడీ ఆరోపిస్తోంది. అదేవిధంగా 9 లిక్క‌ర్ జోన్ల‌పై నియంత్ర‌ణను కూడా ఈ గ్రూప్ ద‌క్కించుకున్నట్లు చెబుతోంది. 30 శాతం వ్యాపారం కవితకు సంబంధించిన ఇండో స్పిరిట్ క‌నుస‌న్న‌ల్లోనే జరుగుతోందని ఈడీ పేర్కొంది. మ‌ద్యం ర‌వాణాలో 65 శాతం, లిక్కర్ సేల్స్‌లో 30 శాతం ఒకే గ్రూప్‌కు చెందిన కంపెనీలు చూసుకుంటున్నాయి.

లిక్కర్ అమ్మకాల్లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లెవల్లో కీలక పాత్ర పోషించారని ఈడీ చెబుతోంది. ఎక్కువ షేర్ ఆమెకే ఉందని.. రానున్న ఐదేళ్లలో ఈ సౌత్ గ్రూప్ ఢిల్లీలో చేసే వ్యాపారం అంచ‌నా విలువ రూ.2500 కోట్లుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ వ్యాపారం తమకు ఇచ్చినందుకు రూ.100 కోట్లు ఆప్ ప్రభుత్వానికి ముడుపులుగా ఇచ్చారని ఈడీ అంటోంది. ఈ డబ్బులను ఆప్‌కు విజ‌య్ నాయ‌ర్ ద్వారా మాగుంట రాఘ‌వ‌రెడ్డి పంపించారని ఈడీ విచారణలో బయటకు వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయల వ్య‌వ‌హారంలో క‌విత పాత్రే కీలకం అని ఈడీ వాదిస్తోంది.  

ఢిల్లీకి కొత్త సీఎస్ నరేష్‌ కుమార్ వచ్చిన తరువాత మద్యం కుంభకోణం బయటకు వచ్చింది. ఆయన సమగ్ర రిపోర్ట్‌ను రూపొందించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేశారు. జూలైలో ఈ కేసును సీబీఐకు అప్పగించగా.. కొత్త మద్యం పాలసీ విధానంతో ఆదాయం రావట్లేదని ఆప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు కీ రోల్ ప్లే చేసినట్లు ఈడీ చెబుతోంది. వీళ్లను అరెస్ట్ చేసిన ఈడీ.. విచారణలో సంచలన విషయాలను బయటపెడుతోంది. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. 

Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!  

Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News