IND vs AUS Boxing Day Test: ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మెల్ బోర్న్ టెస్టు రెండో రోజు ఆటలో షాకింగ్ ఘటన ఆందోళనకు గురిచేసింది. ఫీల్డింగ్ చేస్తోన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వైపు ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చాడు. కోహ్లీని ఆలింగనం  చేసుకునేందుకు యత్నించాడు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం వాటిల్లింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది మైదానంలోకి వచ్చి సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మొదట రోహిత్ శర్మ వైపు వచ్చిన అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకుంది. కానీ విరాట్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో అప్పటికే చేయి వేసిన ఆ వ్యక్తిని సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మ్యాచ్ ను కొనసాగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తొలిరోజు ఆటలో విరాట్ కోహ్లీ, కాన్ స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా ఎంసీజీలో ప్రేక్షకులు పెద్దెత్తున విరాట్ కోహ్లీ పేరును హోరెత్తించారు. దాదాపు 85వేల మందితో కూడిన మెల్ బోర్న్ స్టేడియంలో కోహ్లీ కూడా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా సైగలు చేశాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మీత్ తనకు అచ్చొచ్చిన మెల్ బోర్న్ లో సెంచరీ చేశాడు. 


 





 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook