Ind Vs Aus Highlights: చెదిరిన భారత్ కల.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటమి.. ఛాంపియన్‌గా ఆసీస్
India vs Australia WTC Final 2023 Highlights: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్‌ను 209 పరుగుల భారీ పరుగుల తేడాతో ఓడించి అసలైన ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్.. వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
India vs Australia WTC Final 2023 Highlights: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఛాంపియన్‌గా నిలవాలన్న ఆడిశయాలు అయ్యాయి. శనివారమే ఓటమి దాదాపు ఖాయమైనా.. ఎక్కడో జట్టు గెలుస్తుందేమోనని చిన్న ఆశ ఉండేది. ఐదో రోజు కంగారూ బౌలర్ల జోరుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో వరుసగా టీమిండియా రెండోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. గత 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న భారత్ కల నెరవేరలేదు. 444 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదో రోజు ఆటలో 234 పరుగులకే కుప్పకూలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే విఫలం అవ్వగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ కనీస పోరాటపటిమ కూడా చూపలేదు. అన్ని రంగాల్లో అద్బుతంగా రాణించిన ఆసీస్ జట్టు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచింది.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల కోల్పోయి 164 రన్స్ చేసింది. విజయం సాధించాలంటే ఐదో రోజు 280 పరుగులు చేయాలి. కనీసం డ్రా అయినా కావాలంటే చేతిలో ఉన్న 7 వికెట్లు అయినా కాపాడుకోవాలి. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఉండడంతో గెలుపుపై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరు క్రీజ్‌లో పాతుకుపోవాలని కోరుకున్నారు. అయితే మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే భారీ షాక్ తగిలింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ నుంచి బయటకు వెళుతున్న బంతిని కోహ్లీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. స్టీవ్ స్మిత్ గాలిలో డైవ్ చేస్తూ.. అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
ఇక్కడే భారత్ ఓటమి ఖాయమైంది. కోహ్లీ 49 పరుగులు చేశాడు. అదే ఓవర్‌లో రవీంద్ర జడేజా కూడా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 26 పరుగులు చేసిన రహానే (46)ను స్టార్క్ ఔట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న శార్దుల్ ఠాకూర్ డకౌట్ అవ్వగా.. కేఎస్ భరత్ (23) మళ్లీ విలఫమయ్యాడు. ఉమేశ్ యాదవ్ (1), మహ్మద్ సిరాజ్ (1)లు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. మహ్మద్ షమీ (13) నాటౌట్‌గా నిలిచారు.
చివరగా భారత్ ఇన్నింగ్స్ 234 పరుగుల వద్ద ముగిసింది. 209 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లైయాన్ 4 వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్ 3, స్టార్క్ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ
Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook