Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ

Jasprit Bumrah News: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీని దినేశ్‌ కార్తీక్ కన్ఫార్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కామెంట్రీ చేస్తున్న దినేశ్.. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో బుమ్రాను జట్టులో చూడొచ్చని అన్నాడు. బుమ్రా ఫిట్‌నెస్ మెరుగైందని చెప్పాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 10, 2023, 10:30 PM IST
Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ

Jasprit Bumrah News: టీమిండియా అభిమానులకు శుభవార్త వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా చాలా రోజులుగా జస్ప్రీత్ బుమ్రా క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో న్యూజిలాండ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం పూర్తి కోలుకోవడం జట్టులో రీఎంట్రీ కోసం రెడీగా ఉన్నాడు. ఆగస్టు చివరిలో ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానిస్తూ ఈ విషయం గురించి మాట్లాడాడు.

ఆసియా కప్ 2023కి ముందు ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్‌లో బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉందని దినేశ్ కార్తీక్ అన్నాడు. 'ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో బుమ్రాను టీమిండియాలో చూడవచ్చు. ఈ సిరీస్ నుంచే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బుమ్రా ఫిట్‌నెస్ చాలా మెరుగుపడింది. త్వరలో మైదానంలో ఆడటం చూడవచ్చు..' అని దినేశ్ కార్తీక్ తెలిపాడు. తన రీఎంట్రీ గురించి ఇటీవల బుమ్రా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హాల్ ఫ్రెండ్ మళ్లీ కలుద్దాం.. అంటూ తన షూస్‌ పిక్‌ను షేర్ చేశాడు.

మార్చిలో న్యూజిలాండ్‌లో విజయవంతమైన వెన్ను శస్త్రచికిత్స తర్వాత ఏప్రిల్ నుంచి బుమ్రా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందుతున్నాడు. బుమ్రా వెన్నులో ఒత్తిడి పగుళ్లు కారణంగా సెప్టెంబర్ 2022 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మధ్యలో కోలుకుని జనవరిలో జరిగిన శ్రీలంక సిరీస్‌కు భారత వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు.

అయితే మళ్లీ గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తోపాటు అంతుకుముందు జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం జట్టులో భాగం కాలేకపోయాడు. బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇస్తే.. ఇక టీమిండియా బౌలింగ్ బెంగ తీరినట్లే.

Also Read: Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ క్లియర్‌గా నాటౌట్.. అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..?  

Also Read: Minister Harish Rao: మాటలు కోటలు దాటాయి.. చేతలు పకోడీ చేసినట్లు ఉంది: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News