Ind Vs Aus Dream11 Prediction Today Match: ఆసీస్‌తో టీమిండియా తొలి ఫైట్.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
India Vs Australia World Cup 2023 Dream11 Team Tips: అభిమానులకు అసలు కిక్ ఇచ్చే మ్యాచ్ వచ్చేసింది. నేడు కంగారూలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఎలా ఉండనున్నాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
India Vs Australia World Cup 2023 Dream11 Team Tips: టీమిండియా వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. పటిష్ట ఆస్ట్రేలియాతో నేడు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది ఇంకా తేలలేదు. గిల్ దూరమైతే.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయ్యర్ వైపే హిట్ మ్యాన్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికంగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
అటు ఆస్ట్రేలియాను కూడా కీలక ఆటగాళ్ల గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌కు స్టోయినిస్ దూరమైతే.. ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్‌కు తుదిజట్టులో బెర్త్ ఫిక్స్ అవుతుంది. స్టోయినిస్‌తో పాటు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా హోటల్‌లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీక్ గాయంతో బాధపడ్డాడు. భారత్‌పై జంపా ఆడగలడా లేదా అనేది తేలాల్సి ఉంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
==> వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.
డ్రీమ్ 11 టీమ్ ఇలా..
వికెట్ కీపర్: కేఎల్ రాహుల్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, విరాట్ కోహ్లీ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, గ్లెన్ మాక్స్‌వెల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మిచెట్ స్టార్క్, కుల్దీప్ యాదవ్.
Also Read: Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి