Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!

Rohit Sharma Reacts on Shubman Gill Health: యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడి ఇంకా కోలుకోకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. రేపు ఆసీస్‌తో భారత్ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. గిల్ ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. గిల్ ఆరోగ్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..?   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 7, 2023, 10:59 PM IST
Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!

Rohit Sharma Reacts on Shubman Gill Health: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో తొలి పోరుకు ముందు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోగ్యం భారత్‌ను కలవర పెడుతోంది. ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్న గిల్.. రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అని అనుమానంగా మారింది. చెన్నైలో ప్రాక్టీస్ సెషన్‌లకు గిల్ గైర్హాజరు కావడం ఆందోళన కలిగించింది. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ ఆరోగ్యంపై మీడియా సమావేశంలో అప్‌డేట్ ఇచ్చాడు. గిల్‌ను అనారోగ్యం నుంచి ప్రతి అవకాశం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

“అందరూ ఫిట్‌గా ఉన్నారు. కానీ గిల్ వంద శాతం ఫిట్‌గా లేడు. అతను అనారోగ్యంతో ఉన్నాడు. కానీ గాయం గురించి ఆందోళన లేదు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదు. మేము గిల్‌ను రోజూ పర్యవేక్షిస్తున్నాం. కోలుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఇవ్వబోతున్నాం. కెప్టెన్‌గా గిల్ ఆడాలని ఆలోచించడం లేదు. ముందు ఆరోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నా." అని రోహిత్ శర్మ తెలిపాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. 

గిల్ గత 20 మ్యాచ్‌లలో 72.35 సగటుతో 105.03 స్ట్రైక్ రేట్‌తో 1230 పరుగులు చేశాడు. ఈ ఏడాది వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాతో మొదటి స్థానంలో ఉన్నాడు. గిల్ దూరమైతే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. జూలైలో వెస్టిండీస్‌పై సిరీస్‌పై వరుసగా మూడు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు ఇషాన్. కేఎల్ రాహుల్‌ కూడా మరో ఆప్షన్‌ భారత్‌కు ఉంది. గిల్ ఆడడంపై వైద్య బృందం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటుందని కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

చెన్నై పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాలు ఆడనున్నారు.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతోపాటు హార్థిక్ పాండ్యా మూడో పేసర్ రోల్ ప్లే చేయనున్నాడు. అశ్విన్ తుది జట్టులో ఉంటే టీమిండియా బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. 

టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  

 Also Read: IND Vs AUS ICC World Cup 2023: టీమిండియా తొలి సమరం రేపే.. ఆసీస్‌తో హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇలా..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News