Mahela Jayawardene feels Australia won Border Gavaskar Trophy 2023 with 2-1 vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలో బోర్డర్‌-గవాస్కర్ 2023 ట్రోఫీ ప్రారంభం అవుతుంది. 4 టెస్టుల సిరీస్‌లోని  మొదటి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. భారత్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మాజీలు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఏ జట్టు విజయం సాధిస్తుందని ముందే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అభిప్రాయం వెల్లడించారు. భారత్, ఆస్ట్రేలియా పటిష్టమైన జట్లే అని, అయితే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఐసీసీతో మహేల జయవర్దనే మాట్లాడుతూ... 'భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత్ పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌కు మంచి బౌలింగ్ దళం ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. తొలి టెస్టులో ఏ జట్టు విజయం సాధిస్తుందో.. వారికి ఒక మంచి ప్రారంభం దొరుకుతుంది. అయితే ఎవరు విజేతగా నిలుస్తారనేది చెప్పడం మాత్రం కష్టం' అని అన్నారు. 


'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని నేను భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుంది. అయితే ఆసీస్‌కు భారత్‌ గట్టి పోటీని ఇస్తుంది' అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అంచనా వేశారు. 1996-97లో తొలిసారి జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకొంది. 2016-17, 2018 -2019, 2020-2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా ట్రోఫీని సొంతం చేసుకొంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి సొంతం చేసుకొంటుంది. 


Also Read: TS Budget 2023-24: సామాన్యులకు శుభవార్త.. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల ఆర్థిక సాయం!  


Also Read: Upcoming Cars 2023: భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు.. హ్యుందాయ్ క్రెటాకు మొదలు కానున్న కష్టాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.